Sunday, May 5, 2024

Bhumika:ఖుషి ఖుషిగా భూమిక చావ్లా…

టాలీవుడ్ హీరోలకు భూమిక లక్కీ హీరోయిన్. యువకుడు చిత్రంతో 2000లో హీరోయిన్ గా పరిచయం అయింది. ఇక ఆల్ టైం క్లాసిక్ ఖుషి చిత్రంతో భూమిక పేరు మారుమోగిపోయింది. ఆ తర్వాత వచ్చిన ఒక్కడు, సింహాద్రి చిత్రాలు భూమికని తిరుగులేని హీరోయిన్ గా నిలబెట్టాయి.

కొంతకాలం లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో కూడా భూమిక అలరించింది. ప్రస్తుతం భూమిక వయసు 44 ఏళ్ళు. సహజంగానే ఈ వయసులో హీరోయిన్ గా ఆఫర్లు తగ్గుతాయి. అక్క, వదిన తరహా పాత్రలు చేస్తూనే కొన్ని ప్రయోగాత్మక చిత్రాలు కూడా చేస్తోంది. భూమిక చివరగా తెలుగులో సీతారామం, సీటిమార్ లాంటి చిత్రాల్లో నటించింది.నాలుగు పదుల వయసు దాటినప్పటికీ భూమిక గ్లామర్ లో ఏమాత్రం పదును తగ్గలేదు. ఆమె తరచుగా పోస్ట్ చేసే పిక్స్ ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకర్షిస్తుంటాయి. తాజాగా భూమిక సిగ్గు మొగ్గలేస్తున్నట్లుగా ఉన్న ఫోజులు సర్ప్రైజ్ అనే చెప్పాలి. నీలిరంగు లెహంగాలో భూమిక సిగ్గు మొగ్గలేస్తూ కవ్విస్తోంది. 45 ఏళ్ల వయసులో కుర్రాళ్ళని ఆకర్షించే స్ట్రక్చర్ తో భూమిక మెస్మరైజ్ చేస్తోంది. ఏకంగా నడుము అందాలు చూపిస్తూ పిచ్చెక్కిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement