Friday, December 6, 2024

హుజురాబాద్ ఉప ఎన్నిక.. పాదయాత్రకు సిద్ధమైన మరో నేత

తెలంగాణలో పాదయాత్రల సీజన్ నడుస్తోంది. హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఇప్పటికే బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ పాదయాత్ర చేస్తున్నారు. ఇక, ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా మరో రెండు రోజుల్లో పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. ఇక, రేపో మాపో టీ.పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా పాదయాత్ర చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇప్పుడు తాజాగా మాజీ ఎమ్మెల్యే జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య కూడా పాదయాత్ర చేపట్టనున్నారు.

తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకోకపోతే ఈ నెల 27 నుంచి హుజూరాబాద్లో పాదయాత్ర చేస్తామని ఆర్.కృష్ణయ్య ప్రకటించారు. తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఫీల్డ్ అసిస్టెంట్ జేఏసీ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement