Friday, May 10, 2024

లార్డ్స్ లో అదరగొట్టి..లీడ్స్ లో తడబడ్డారు

ఇంగ్లండ్, ఇండియా టెస్ట్ సిరీస్ ఆశక్తికరంగా జరుగుతోంది. ఇరు జట్ల మధ్య జరిగిన తొలి టెస్ట్ డ్రాగా ముగియగా..లార్డ్స్‌ టెస్టులో అద్భుతం విజయంతో ఆతిథ్య జట్టును బెంబేలెత్తించిన టీమిండియా లీడ్స్ లో కి వచ్చే సరికి తడబడింది. రెండో టెస్ట్ గెలిచి ఆధిక్యం దక్కించుకున్న టీమ్‌ఇండియా మూడో టెస్టులో ఆదిలోనే కోలుకోలేని దెబ్బతిన్నది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న కెప్టెన్‌ కోహ్లీ నిర్ణయం బెడిసికొట్టింది. లార్డ్స్‌ టెస్టు ఓటమితో కసి మీదున్న ఇంగ్లండ్‌ పేసర్లు టీమ్‌ఇండియా బ్యాటింగ్‌ను కుప్పకూల్చారు.దీంతో టీమ్‌ఇండియా 40.4 ఓవర్లలో 78 పరుగులకే చాపచుట్టింది. కోహ్లీసేనను స్వల్ప స్కోరుకే పరిమితం చేసిన ఇంగ్లండ్‌..బ్యాటింగ్‌లోనూ ఇరగదీసింది. తొలి రోజు ఆట ముగిసే సరికి వికెట్‌ నష్టపోకుండా 120 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌ ప్రస్తుతం 42 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతున్నది. ఇప్పటికే వికెట్ నష్టపోని ఇంగ్లండ్ ఈ రోజు భారీ స్కోరు నమోదు చేయవచ్చు.. దీంతో ఈ టెస్ట్ మ్యాచ్ టీమిండియా ఓడిపోకుండ ఉండాలంటే అద్భుతం జరగాల్సిందే.

టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా 78 పరుగులకే ఆలౌట్ అవుతుందని ఎవరు ఊహించి ఉండరు. తొలి సెషన్ లో అండర్స్ దాటికి టాప్ ఆర్డర్ కుప్పకూలిన..జరిగిందేదో జరిగింది! రెండో సెషన్‌లో భారత్‌ చక్కబడదా! పైగా హిట్‌మ్యాన్‌ రోహిత్‌ ఉండనే ఉన్నాడు. అని సరిపెట్టుకున్న స్థైర్యం చెల్లాచెదురయ్యేందుకు… భారత్‌ ఆలౌట్‌ అయ్యేందుకు ఎంతో సేపు పట్టలేదు. లంచ్‌ అయిన వెంటనే రిషభ్‌ పంత్‌ (2) అవుటయ్యాడు. 36 ఓవర్లలో భారత్‌ స్కోరు 67/5. ఇంగ్లీష్‌ పేస్‌ తుఫాను ఇంకా ముగిసిపోలేదు. ఓవర్టన్‌ (37వ ఓవర్‌), స్యామ్‌ కరన్‌ (38వ ఓవర్‌) ఇద్దరు ఒక్కో ఓవర్లో రెండేసి వికెట్లను పడేశారు. దెబ్బకు 67/9…‘సున్నా’ పరుగుల వ్యవధిలో 12 బంతుల్లో భారత్‌ 4 వికెట్లు కోల్పోయింది. మిగిలిపోయిన ఆఖరి వికెట్‌ లాంఛనాన్ని ఓవర్టనే సిరాజ్‌ను అవుట్‌ చేయడం ద్వారా పూర్తి చేశాడు. లంచ్‌ తర్వాత 14.5 ఓవర్లు ఆడిన భారత్‌ 22 పరుగులు చేసి మిగిలిన 6 వికెట్లను సమర్పించుకుంది.

ఇది కూడా చదవండి: Virat kohli: సెంచరీ లేని అర్థసెంచరీ

Advertisement

తాజా వార్తలు

Advertisement