Sunday, May 19, 2024

మహిళలకు గుడ్ న్యూస్: భారీగా తగ్గిన బంగారం ధరలు..

బంగారం ధరలు మరోసారి తగ్గాయి. అసలే శ్రావణ మాసం కావడంతో పెళ్లిళ్ల కోసం బంగారం గిరాకీ ఎక్కువే.. సాధారణంగా ఈ సమయంలో బంగారం ధరలకు రెక్కలు వస్తాయి. కాని ఈ మధ్య బంగారం ధరలు తరచూ తగ్గుతున్నాయి. మన దేశంతో పాటు ప్రపంచంలో ఎక్కడైనా బంగారానికి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. అయితే… గ‌త కొన్ని రోజులుగా పెరుగుతూ, కొద్దిగా తగ్గుతూ వ‌చ్చిన బంగారం ధ‌ర‌ల్లో ఈరోజు భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. బంగారం ధ‌ర‌లు భారీగా త‌గ్గుముఖం ప‌ట్టాయి. హైద‌రాబాద్ బులియ‌న్ మార్కెట్లో ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 100 తగ్గి రూ. 44,350 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 110 తగ్గి రూ. 48,380 కి చేరిది. దేశీయంగా మార్కెట్లు తిరిగి క్రమంగా పుంజుకోవ‌డంతో బంగారం ధ‌ర‌లు తగ్గుముఖం ప‌డుతున్నాయి. ఇక బంగారం ధ‌ర‌లు తగ్గితే… వెండి ధ‌ర‌లు మాత్రం భారీగా పెరిగాయి. కిలో వెండి ధ‌ర రూ. 500 పెరిగి రూ. 68,200 వ‌ద్ద కొనసాగుతోంది.

ఇది కూడా చదవండి: Q న్యూస్ లో పోలీసుల సోదాలు.. మీడియాపై అత్యుత్సాహం

Advertisement

తాజా వార్తలు

Advertisement