Tuesday, May 21, 2024

Q న్యూస్ లో పోలీసుల సోదాలు.. మీడియాపై అత్యుత్సాహం

హైదరాబాద్ లోని బొడుప్పల్ లోని క్యూ న్యూస్ ఆఫీస్‌లో సీసీఎస్‌ పోలీసుల తనిఖీలు చేశారు. ఈ సందర్బంగా క్యూ న్యూస్ ఆఫస్ వద్దకు వెళ్లిన మీడియాపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. లోపలికి మీడియాను పోలీసులు అనుమతించలేదు. కవర్ చేయడానికి వెళ్లిన మీడియా ప్రతినిధులను పోలీసులు అదుపులోకి తీసుకుని మేడిపల్లి పీఎస్ కు తరలించారు. పోలీసుల తీరుపై జర్నలిస్టు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.

ఇటీవల ఓ యువతి ఫిర్యాదుతో తీన్మార్ మల్లన్నపై హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. మల్లన్నకు చెందిన యూట్యూబ్ ఛానల్‌లో సోదాలు నిర్వహించి హార్డ్ డిస్కులు ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సైబర్ క్రైమ్ పోలీస్‌స్టేషన్‌లో విచారణకు హాజరు కావాలని మల్లన్నకు నోటీసులు జారీ చేశారు. అయితే విచారణ పేరుతో తనను పోలీసులు ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారని,  సైబర్ క్రైమ్ పోలీసులిచ్చిన నోటీస్‌ను రద్దు చేయాలని మల్లన్న కోర్టును ఆశ్రయించారు.

ఈ వార్త కూడా చదవండిః సీఎం జగన్ పరువు తీస్తున్నారుః వలంటీర్ వ్యవస్థపై వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్య

Advertisement

తాజా వార్తలు

Advertisement