Saturday, June 22, 2024

IPL Qualifier1 | టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్‌..

రెండు నెలలుగా క్రికెట్‌ అభిమానులకు కావాల్సినంత వినోదాన్ని పంచుతున్న ఐపీఎల్‌-17 నాకౌట్‌ దశకు చేరుకుంది. క్వాలిఫయర్‌-1లో భాగంగా ఇవ్వాల‌ (మంగళవారం) అహ్మదాబాద్‌ వేదికగా టేబుల్‌ టాపర్స్ కోల్‌కతా.. హైదరాబాద్ జ‌ట్లు పోటీప‌డ‌తాయి. కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన హైద‌రాబాద్ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. కాగా మరికొద్ది సేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది.

జ‌ట్ల వివరాలు :

సన్‌రైజర్స్ హైదరాబాద్ :

ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ (wk), అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, భువనేశ్వర్ కుమార్, పాట్ కమిన్స్ (c), విజయకాంత్ వియాస్కాంత్, T నటరాజన్.

కోల్‌కతా నైట్ రైడర్స్ :

రహ్మానుల్లా గుర్బాజ్ (WK), సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్ (c), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా.

- Advertisement -

ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు అర్హత సాధించే అవకాశం ఉంటుంది. సమిష్టి ప్రదర్శనలతో ప్లేఆఫ్స్‌ చేరిన ఈ రెండు జట్లలో మ్యాచ్‌ విన్నర్లకు కొదవలేకపోవడంతో అహ్మదాబాద్‌ స్టేడియంలో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement