Wednesday, July 24, 2024

TS | రెండో సారి మోసపోతే మనదే తప్పు : కేటీఆర్

వరంగల్-నల్గొండ-ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా నాగార్జున సాగర్ లో జరిగిన పార్టీ సన్నాహాక సమావేశంలో కేటీఆర్ మట్లాడారు. డిసెంబర్ 9 నాడే రుణమాఫీ అని రేవంత్ రెడ్డి అన్నాడు. ఇప్పుడు మాత్రం ఊసరవెళ్లి లాగా తేదీలు మారుస్తున్నాడని మండిపడ్డారు. అరచేతిలో వైకుంఠం చూపి ఆరు గ్యారంటీలు అని అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. ఒక్కసారి మోసపోతే మోసం చేసిన వాడిది తప్పు. కానీ రెండో సారి మోసపోతే మాత్రం మోస పోయిన వాళ్లదే తప్పు అవుతదని కేటీఆర్ అన్నారు.

నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటదో… రేవంత్ రెడ్డి మాటల్లో కూడా అంతే నిజాయితీ ఉందని.. సిగ్గులేకుండా ఆరు గ్యారంటీల్లో ఐదు అమలు చేశామని రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నాడని అన్నారు. 75 శాతం పండించే దొడ్డు వడ్లకు బోనస్ లేదంట. అంటే వీళ్ల మాటలు బోగస్ అని తేలిపోయిందన్నారు. బీఆర్‌‌ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణలో ఓ వైపు అభివృద్ధిని, మరోవైపు సంక్షేమ రంగాన్ని పరుగులు పెట్టించామన్నారు.

కాంగ్రెస్ తప్పుడు హామీలు, యూట్యూబ్ తప్పుడు ప్రచారాల కారణంగా స్వల్ప తేడాతో ఓడిపోయామని.. పని చేసి కూడా మనం సరిగా చెప్పుకోలేకపోయాం. అందుకే ఓడిపోయామని విశ్లేషించారు. ఇలాంటి మోసపూరితమైన ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ఇప్పుడు అధికార స్వరాలు కాదు… ధిక్కార స్వరాలు కావాలన్నారు.

కాంగ్రెస్ అభ్యర్థి చదువుకున్నాడో లేదో తెలియదు గానీ బ్లాక్ మెయిలింగ్ చేసే తెలివి అయితే ఉందన్నారు. ఐఐటీలు, నిట్, ప్రభుత్వ సర్వీసులు, తెలంగాణ ఉద్యమం ఇలా అన్ని వర్గాల నుంచి బీఆర్ఎస్ లో నాయకులు ఉన్నారని.. బీఆర్ఎస్ లో చదువుకున్న వారికి అత్యంత ప్రాధాన్యం ఉందన్నారు. ఈ నెల 27న విద్యావంతుడైన రాకేష్ రెడ్డి కి ఫస్ట్ ప్రియారిటీ ఓటు వేసి గెలిపించాలని కేటీఆర్ కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement