Friday, July 26, 2024

Emergency Landing … సింగ‌పూర్ విమానంలో భారీ కుదుపులు… ఒక‌రి మృతి…ప‌లువురికి గాయాలు

సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానం గగనతలంలో ఉండగా ఆక‌స్మికంగా భారీ కుదుపుల‌కు గురైంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, 30 మందికి గాయాలయ్యాయి. ఈ విమానంలో ప్ర‌యాణిస్తున్న ప్రయాణికుడు మరణించాడని.. పలువురు గాయపడినట్లు ఎయిర్‌లైన్ తెలిపింది. బోయింగ్ 777-300ER విమానం 211 మంది ప్రయాణికులు, 18 మంది సిబ్బందితో లండన్ నుంచి సింగపూర్‌కు బయలుదేరింది. గగనతలంలో ఉండగా భారీ కుదుపులకు లోనైంది. దీంతో బ్యాంకాక్‌లో పైలట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసినట్లు విమానయాన సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఒకరు చనిపోయినట్లుగా.. 30 మంది గాయపడినట్లుగా సింగపూర్ ఎయిర్‌లైన్స్ ధృవీకరించింది.

మృతుడి కుటుంబానికి ఎయిర్‌లైన్స్ సంతాపం తెలిపింది. క్షతగాత్రలకు వైద్యం అందిస్తున్నట్లు చెప్పింది. ప్రయాణికులకు, సిబ్బందికి సాయం అందించడమే తమ ప్రాధాన్యత అని తెలిపింది. అవసరమైన వైద్య సదుపాయాలు అందిచేందుకు థాయ్‌లాండ్‌లోని స్థానిక అధికారులతో కలిసి పని చేస్తున్నట్లు చెప్పింది. అలాగే బ్యాంకాక్‌కు ఒక బృందాన్ని పంపుతున్నట్లు ఎయిర్‌లైన్స్ వెల్లడించింది. విమానంలో కుదుపులు రావడానికి కారణాలు తెలుసుకునేందుకు సాంకేతిక సిబ్బందిని అక్క‌డికి పంపుతున్న‌ట్లు తెలిపింది..

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement