పట్టణ ప్రజలంతా ప్లాస్టిక్ నియంత్రణకు సహకారం అందించాలని పెద్దపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ దాసరి మమత ప్రశాంత్ రెడ్డి అన్నారు. ప్లాస్టిక్ వాడకం వల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని పేర్కొన్నారు. గురువారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని 14వ వార్డులో మున్సిపల్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నియంత్రణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ మాట్లాడుతూ ప్రజలంతా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణ కోసం తమవంతు కృషి చేయాలని కోరారు. ప్లాస్టిక్ బదులుగా పేపరు, బట్టలతో తయారు చేసిన సంచులు వాడాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఇంటింటికి పర్యటించి ప్లాస్టిక్ నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement