Monday, December 9, 2024

మేడారం సమ్మక్క పూజారి మృతిపై మంత్రి సంతాపం

మేడారం సమ్మక్క పూజారి సిద్దబోయిన సాంబశివరావు మృతిపై రాష్ట్ర గిరిజన, స్త్రీ -శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ గారు తీవ్ర సంతాపం తెలిపారు. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే మేడారం సమ్మక్క – సారలమ్మ మహా జాతరలో సమ్మక్కను చిలకలగట్టు నుండి గద్దెల వరకు తీసుకొచ్చేందుకు సాంబయ్య కొమ్ము పూజారిగా నిష్టతో పని చేసేవారని గుర్తు చేశారు. చిన్న వయసులోనే అనారోగ్యం పాలై హఠాన్మరణం చెందడం విషాదకరం అన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు

Advertisement

తాజా వార్తలు

Advertisement