Monday, May 6, 2024

Peddapalli – గులాబీ పార్టీలోకి వలసలు వెల్లువ

ప్రతిపక్ష పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేకపోవడంతో గులాబీ పార్టీలోకి పెద్ద ఎత్తున కాంగ్రెస్, బిజెపి నాయకులు చేరుతున్నారని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తెలియజేశారు. ఆదివారం కాల్వ శ్రీరాంపూర్ మండలం కునారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కి చెందిన నాయకులు బోడుకల ఓదెలు, మసాల కిష్టయ్య, మిట్టపల్లి రాజమల్లు, కాదాసి లింగమ్మ, కల్వల పోషాలు, ఏడెల్లి చంద్రయ్య, బోడుకల పెద్ద రాములు, మిట్టపల్లి సదానందం,కుమారస్వామి, మసాల పెద్ద శంకర్, గుంపుల ఓదెలు, కాలువల పెద్ద సంపత్, ఏడెల్లి చిన్న శంకర్, మారుపాక రాజ్ కుమార్, ఆవునూరి సుమంత్ ,మోదుంపురం లక్ష్మణ్ లు బిఆర్ఎస్ లో చేరగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

అనంతరం మాట్లాడుతూ కాంగ్రెస్ 6 గ్యారంటీలను ప్రజలు నమ్మడం లేదని, కెసిఆర్ భరోసా లో పేర్కొన్న 17 హామీలనే ప్రజలు నమ్ముతున్నారన్నారు. సంక్షేమ పథకాల అమలు కేసీఆర్ తోనే సాధ్యమని, గత కాంగ్రెస్ పాలల్లో పింఛన్ 200 రూపాయలు మాత్రమే ఉండేదని ముఖ్యమంత్రి కేసీఆర్ 2000 రూపాయలకు పెంచాలని మరోసారి అధికారంలోకి రాగానే 5 వేలకు రూపాయల వరకు పెంచుతారన్నారు. వికలాంగుల పింఛన్ 6000 చేస్తామని, ఆరోగ్య శ్రీ గరిష్ట పరిమితిని 15 లక్షలకు పెంచుతామని, రైతు బంధును 16 వేలకు పెంచుతామన్నారు. తెల్ల రేషన్ కార్డు గల ప్రతి ఒక్కరికి సన్న బియ్యం పార్టీతోపాటు ఐదు లక్షల రూపాయల బీమా సౌకర్యం అందుబాటులోకి తెస్తామన్నారు. ప్రతి మహిళకు 3000 రూపాయలు నెలకు అందిస్తామని 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందజేస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో ఛైర్మెన్ గజవెల్లి పురుషోత్తం,ఎంపీటీసీ కొల్లూరి రమాదేవి రాయమల్లు,మాజీ మార్కెట్ ఛైర్మెన్ కొట్టె సుజాత రవీందర్, ఉప సర్పంచ్ బోడకుంట్ల తిరుపతి, మాజీ సర్పంచ్ బోటుకు రవీందర్, గ్రామ శాఖ అధ్యక్షులు గొర్ల సంతోష్, మంథని రాజయ్య రెడ్డి రాజుల మోహన్, ఓర్సు స్వరూప ,బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement