Monday, May 6, 2024

నకిలీ విత్తనాలు విక్రయిస్తే పిడి యాక్ట్ – ఇంచార్జి డీసీపీ అఖిల్

రైతులకు నకిలీ విత్తనాలు ఎరువులు అంటగడితే విత్తన డీలర్ల, యజమానుల పై పీడీ యాక్ట్ పెట్టి జైలుకు పంపిస్తామని పోలీస్ మంచిర్యాల ఇంచార్జి డీసీపీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ హెచ్చరించారు. బెల్లంపల్లి లోని ఫంక్షన్ హల్ లో బెల్లంపల్లి సబ్ డివిజన్ కు సంబంధించిన బెల్లంపల్లి రూరల్ బెల్లంపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మండలాల పరిధిలోని విత్తన వ్యాపారులకు,ట్రాన్స్ పోర్ట్ ఏజెన్సీ వారికీ నకిలీ విత్తనాలపై, నిషేధిత గడ్డి మందులపై, అక్రమ రవాణా పైన అవగాహన సదస్సు నిర్వహించారు. నకిలీ విత్తనాలు అమ్మే వ్యాపారులను ప్రభుత్వం ఎట్టి పరిస్థితిలో ప్రోత్సహించదని తెలిపారు. విత్తనాల విక్రయాలపై ప్రత్యేక బృందాలు నిఘా పెట్టాయి అని నకిలీ విత్తనాలు అమ్మిన, నిల్వచేసిన రవాణా చేసిన, నకిలీ దందా చేస్తున్నట్లు తెలిసిన కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ ..కర్ణాటక ..మహారాష్ట్ర నుంచి మంచిర్యాల జిల్లాలో నకిలీ విత్తనాలు అధికంగా వస్తున్నట్లు సమాచారం ఉందన్నారు. సీడ్స్ అండ్ ఫెర్టిలైజర్ దుకాణాల యజమానులు రైతులకు నకిలీ విత్తనాలు నిషేధిత గడ్డి మందు అధిక ధరకు అమ్మి మోసం చేస్తే చర్యలు తప్పవన్నారు. బిల్లు లేకుండా ఎవరైనా విత్తనాలు అమ్మితే వెంటనే వ్యవసాయ అధికారులకు ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో బెల్లంపల్లి ఏసిపి ఏడ్ల మహేష్,మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రమోద్ రావు, బెల్లంపల్లి టౌన్ సీఐ రాజు,బెల్లంపల్లి రూరల్ సీఐ బాబు రావు,తాండూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జగదీశ్, ఎస్సైలు వ్యవసాయ శాఖ అధికారులు, డీలర్లు, ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ వారు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement