Friday, April 26, 2024

Musi Water | కొనసాగుతున్న ఇన్​ఫ్లో.. మూసీ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల

సూర్యాపేట రూరల్, (ప్రభ న్యూస్) : ఎగువనుంచి భారీగా వరద నీరు వచ్చి మూసి ప్రాజెక్టులో చేరడంతో నదిలో నీటి మట్టం పెరిగింది. దీంతో ఇవ్వాల (సోమవారం) 644.60 అడుగుల లెవల్​కు వాటర్​ చేరింది. ఇక.. ప్రాజెక్టు నీటి మట్టం 645 అడుగులు కాగా, ఇంకా ఇన్​ఫ్లో కొనసాగుతోంది. ప్రస్తుతం 243.16 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండడంతో అధికారులు దిగువకు నీటిని విడుదల చేశారు.

ప్రాజెక్ట్ నుండి 330 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని మంత్రి జగదీష్ రెడ్డి సూచించారు. దీంతో అధికారులు ఉదయం 3 క్రస్ట్​ గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు. కార్యక్రమంలో డీఈ చంద్రశేఖర్, ఏఈలు ఉదయ్ కుమార్, మమత, ఇరిగేషన్​ సిబ్బంది ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement