Monday, October 14, 2024

KTR: నిరంతర విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ.. కేటీఆర్

మండు వేసవిలో సైతం అన్ని రంగాలకు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్తును అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రావ‌త‌ర‌ణ ద‌శాబ్ది ఉత్స‌వాలు అట్ట‌హాసంగా కొన‌సాగుతున్నాయి. ద‌శాబ్ది వేడుక‌ల్లో భాగంగా ఇవాళ తెలంగాణ విద్యుత్ విజ‌యోత్స‌వం, సింగ‌రేణి సంబురాలు నిర్వ‌హిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.

తెలంగాణ విద్యుత్ ప్ర‌గ‌తి నిత్య కోత‌ల నుంచి నిరంత‌ర వెలుగుల ప్ర‌స్థానానికి చేరుకుంద‌ని కేటీఆర్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడిననాడు ఆవరించి ఉన్న చిమ్మ చీకట్లను చీల్చుకుంటూ, విద్యుత్తు రంగంలో అద్భుత రీతిలో పురోగతి సాధించి, దేశానికే దారిచూపే టార్చ్‌ బేరర్‌గా నిలిచింది మన తెలంగాణ. కరెంట్ కోతలు, పవర్ హాలీడేలు, కరెంట్‌ కోసం ధర్నాలు, సబ్‌స్టేషన్ల ముట్టడి, రాస్తారోకోలు 2014కు పూర్వం నిత్యకృత్యాలు. స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అకుంఠిత దీక్షతో కరెంట్‌ నిరంతరాయంగా వెలుగులు పంచుతున్నది. నేడు యావత్‌ భారతదేశంలో కరెంటు కోతలు లేని ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement