Monday, April 29, 2024

నిరుద్యోగులను అవమానించిన ఎమ్మెల్సీ కవిత.. మానాల మోహన్ రెడ్డి

నిజామాబాద్ సిటీ, జులై 22 (ప్రభ న్యూస్) : జాబ్ మేళా పేరుతో జిల్లాలోని నిరుద్యోగులను ఎమ్మెల్సీ కవిత అవమానించారని నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి మండిపడ్డారు. శనివారం నిజామాబాద్ నగరంలోని జిల్లా కాంగ్రెస్ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి పిసిసి ఉపాధ్యక్షులు తాహీర్ బీన్ హందాన్, సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కేశ వేణుతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ… జాబ్ మేళా పేరుతో నిరుద్యోగులను అపహాస్యం చేశారని కవిత మాట్లాడుతూ జాబ్ మేళాకు విశేష స్పందన వచ్చినందుకు సంతోషపడు తున్నానని అనడం ఆమె తల బిరుసో లేక అజ్ఞానమో అర్థం కావడం లేదని ఆయన ఎద్దేవా చేశారు. ప్రజా ప్రతినిధులు ఎక్కడైనా నిరుద్యోగులు ఉండకూడదని కోరుకుంటారు.. కానీ కవిత అందుకు భిన్నంగా జిల్లాలో పెరుగుతున్న నిరుద్యోగ యువతను చూసి సంబర పడిపోతున్నారని ఆయన అన్నారు.

అసలు ప్రారంభమే కానీ ఐటి హబ్ పేరుతో జాబ్ మేళా నిర్వహించడమే హాస్యాస్పదమని అన్నారు. దానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ కవిత హాజరై మాట్లాడిన తీరు సగటు నిరుద్యోగిని మనోవేదనకు గురిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు నరాల రత్నాకర్, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రామ్మూర్తి గోపి, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విక్కీ యాదవ్, ఎన్.ఎస్.యు.ఐ జిల్లా అధ్యక్షులు వేణు రాజ్, ఎన్.ఎస్.యు.ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విపుల్ గౌడ్, రాష్ట్ర ప్రచార కమిటీ ఈసీ మెంబర్స్ జావిద్ అక్రమ్, గడుగు రోహిత్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కేశ మహేష్,జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గంగారెడ్డి, అష్రాఫ్ వహీద్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement