Friday, April 26, 2024

ప్రజలే బీజేపీకి బుద్ధి చెబుతారు : కాంగ్రెస్ నేత సుదర్శన్ రెడ్డి

నిజామాబాద్ జిల్లాలోని బోధన్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం సత్యాగ్రహ దీక్షను చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రాహుల్ గాంధీని పార్లమెంట్ నుండి బహిష్కరించడం తన పార్లమెంటేరియన్ సభ్యత్వాన్ని రద్దు పరచడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. భారత దేశంలో రాజుల పాలన తలపించేటట్లు కేంద్ర ప్రభుత్వం విధానాలను అవలంభిస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని దిక్కరిస్తూ తన సొంత ఎజెండాని అమలు చేస్తూ దేశ పరిస్థితులను చిన్నభిన్నం చేస్తూ ప్రజల్లో ఆందోళన సృష్టిస్తున్నారని సుదర్శన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. దేశంలో బీజేపీ మినహా ప్రతిపక్షాలన్నీ రాహుల్ గాంధీకి మద్దతు ఇస్తున్నాయని, దేశంలో ఈ పరిణామం మంచి పరిణామం అన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలే బీజేపీకి బుద్ధి చెప్తారని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఏళ్ళు దేశాన్ని పరిపాలించి అభివృద్ధి బాటలో నడిపించిందని, బీజేపీ తన సొంత జెండాను అమలు చేయడం, మతాలను రెచ్చగొడుతూ ఓటు బ్యాంకుగా మ‌ర‌ల్చుకోవ‌డం దేశానికి ఎంతో ప్రమాదకరమని మాజీ మంత్రి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గంగా శంకర్, పాషా మోయినుద్దీన్, తహర్బిన్ హంద్దన్, పులి శ్రీనివాస్, గడుగు గంగాధర్, మహమ్మద్ పాషా తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement