Saturday, April 20, 2024

ఎన్టీఆర్ 30కి.. మరో హాలీవుడ్ టెక్నీషియన్

స్టార్ హీరో ఎన్టీఆర్ 30చిత్రానికి మరో హాలీవుడ్ టెక్నీషియన్ వర్క్ చేయనున్నారు. ఈ మేరకు అప్ డేట్ ఇచ్చారు మేకర్స్.
ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ‌.. ఎన్టీఆర్ తో ఓ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు.ఈ చిత్రానికి మరో హాలీవుడ్‌ టెక్నీషియన్‌ని దించారు. వీఎఫ్‌ఎక్స్ కి సంబంధించిన ప్రముఖ హాలీవుడ్‌ వీఎఫ్‌ఎక్స్ సూపర్‌వైజర్‌ని రంగంలోకి దించారు. ఆక్వామెన్‌, జస్టిస్‌ లీగ్‌, బ్రాడ్‌ మ్యాన్‌ వర్సెస్‌ సూపర్‌మ్యానర్‌` చిత్రాలకు పనిచేసిన వీఎఫ్‌ఎక్స్‌ సూపర్‌వైజర్‌ బ్రాడ్‌ మిన్నిచ్ ని రంగంలోకి దించారు. తాజాగా దర్శకుడు కొరటాల.. ఆయనతో సెట్‌లో డిస్కస్‌ చేస్తున్న ఫోటోని పంచుకుంది చిత్ర‌ యూనిట్‌. కీలక సన్నివేశాలకు ఆయన సారథ్యంలో వీఎఫ్‌ఎక్స్ వర్క్ జరుగుతుందని టీమ్‌ తెలిపింది. మంగ‌ళ‌వారం నుంచి ఆ వర్క్ కూడా ప్రారంభమైనట్టు వెల్లడించారు. దీంతో ఎన్టీఆర్‌ 30 చిత్రానికి హాలీవుడ్‌ టచ్‌ గట్టిగానే ఇస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement