Friday, March 29, 2024

మాతా శిశు మరణాలు తగ్గుముఖం : మంత్రి హ‌రీశ్ రావు

రాష్ట్రంలో మాతా శిశు మ‌ర‌ణాలు త‌గ్గుముఖం ప‌ట్టాయ‌ని, దేశంలోనే మూడో స్థానంలో తెలంగాణ ఉన్న‌ద‌ని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావు స్ప‌ష్టం చేశారు. మొద‌టి స్థానంలోకి చేరేందుకు మ‌నంద‌రం కృషి చేయాల్సి అవ‌స‌రం ఉంద‌ని మంత్రి అన్నారు. నిమ్స్‌కు అనుబంధంగా.. ఎర్ర‌మంజిల్ లో నిర్మించే 200 ప‌డ‌క‌ల‌ మాతా, శిశు సంర‌క్ష‌ణ కేంద్రం నిర్మాణానికి మంత్రి హ‌రీశ్‌రావు మంగ‌ళ‌వారం శంకుస్థాప‌న చేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి హ‌రీశ్‌రావు మాట్లాడుతూ.. ఎంసీహెచ్ సూప‌ర్ స్పెషాలిటీ ఆస్ప‌త్రుల‌ను మొద‌టిసారిగా రాష్ట్రంలో తొలిసారిగా హైద‌రాబాద్ లో ఏర్పాటు చేసుకుంటున్నామ‌ని తెలిపారు. గ‌తంలో రాష్ట్రంలో మూడు ఎంసీహెచ్ ఆస్ప‌త్రులు మాత్ర‌మే ఉండే ఆ సంఖ్య‌ను 27కు పెంచుకున్నాం త‌ద్వారా గొప్ప ఫ‌లితాలు వ‌చ్చాయ‌న్నారు. ఎంసీహెచ్ ఆస్ప‌త్రుల నిర్మాణానికి రూ. 499 కోట్ల‌ను ఖ‌ర్చు చేసిన‌ట్లు తెలిపారు. ఎంసీహెచ్ ఆస్ప‌త్రుల‌ను 27కు పెంచ‌డంతో మాతా శిశు మ‌ర‌ణాలు తగ్గాయ‌న్నారు. తెలంగాణ ఏర్ప‌డ‌క ముందు మాతా మ‌ర‌ణాలు ప్ర‌తి ల‌క్ష‌కు 92 మ‌ర‌ణాలు ఉండే.. దాన్ని 43కు త‌గ్గించ‌గ‌లిగాం అన్నారు. ప్ర‌తి ల‌క్ష‌కు శిశు మ‌ర‌ణాలు 36 ఉంటే 21కి త‌గ్గించుకున్నాం అని తెలిపారు. మాతాశిశు మ‌ర‌ణాలు త‌గ్గుముఖం ప‌ట్టి దేశంలో మూడో స్థానంలో ఉన్నాం అన్నారు. మొద‌టి స్థానానికి వెళ్లాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. అందుకు సూప‌ర్ స్పెషాలిటీ ఆస్ప‌త్రుల అవ‌స‌రం ఉంద‌ని హ‌రీశ్‌రావు స్ప‌ష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement