Sunday, April 28, 2024

NZB: దళిత బంధును వెంటనే విడుదల చేయాలి.. కలెక్టరేట్ ఎదుల ఆందోళన

నిజామాబాద్ సిటీ, జనవరి 11(ప్రభ న్యూస్): ఎన్నికల అనంతరం ఆల్గోయింగ్ స్కీమ్ క్రింది లబ్దిదారులకు మంజూరైన ధళితబంధును వెంటనే విడుదల చేసి దళిత కుటుంబాల ఆర్థిక అభ్యున్నతికి తోడ్పడాలని అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు డిమాండ్ చేశారు. గురువారం నగరంలోని జిల్లా కలెక్టరేట్ ఎదుట అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో దళితబంధు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేశారు.

ఈ సందర్భంగా యువజన సంఘం నాయకులు మాట్లాడుతూ… దళితుల అభ్యున్నతికి ప్రతీ ఒక్క దళిత కుటుంబం ఆర్థిక పరంగా, వ్యాపార పరంగా అభివృద్ధి చెందాలనే సదుద్దేశంతో దళితబంధు పథకం ద్వారా మొదటి దశలో అనేక దళిత పేద కుటుంబాలను ఆదుకోవడం జరిగిందన్నారు. రెండవ దశ దళిత బంధు జిల్లా వ్యాప్తంగా దళిత కుటుంబాలు లబ్దిదారులుగా ఎంపికై బ్యాంకు ఖాతాలు వెరిఫికేషన్ తో పాటు కాగితాల వెరిఫికేషన్ కూడా పూర్తయిందని పేర్కొన్నారు. కానీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో తాత్కాలికంగా దళితబంధు నిలిపివేయడం జరిగిందని వాపోయారు. దళిత బంధును వెంటనే విడుదల చేసి దళిత కుటుంబాల ఆర్థిక అభ్యున్నతికి తోడ్పడాలని కోరారు. ఈ కార్యక్రమంలో జీవన్, గంగన్న, రమేష్, సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement