Thursday, May 2, 2024

మహిళలు అన్నిరంగాల్లో రాణించాలి : ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి

భువనగిరి : మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. ఆదివారం భువనగిరి మండలం ముత్తిరెడ్డిగూడెం గ్రామంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా ఎక్సల్ట్ సాఫ్ట్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో మగ్గం వర్క్స్, టైలరింగ్ శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్లను అందజేశారు. సంస్థ చేస్తున్న సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ జడల అమరేందర్ గౌడ్, ఎంపీపీ నిర్మల వెంకటస్వామి, జడ్పీటీసీ బీర్ మల్లయ్య, సర్పంచ్ సత్తయ్య, నాయకులు సత్తయ్య, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement