Sunday, May 19, 2024

రాజగోపాల్ రెడ్డి స్వార్థం కోస‌మే ఉప ఎన్నిక వచ్చింది : మంత్రి గంగుల కమలాకర్

న‌ల్ల‌గొండ : ప్రజలు ఓటేసి గెలిపించేది వారి సమస్యల పరిష్కారం కోసమని, సొంతపనుల కోసం కాదన్నారు మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. నేడు సంస్తాన్ నారాయణ పురంలో ముదిరాజ్ సంఘంతో ఆత్మీయ సమావేశం నిర్వహించి మాట్లాడారు.. రాజగోపాల్ రెడ్డి మునుగోడు ప్రజల కోసం కాకుండా తన సొంత కాంట్రాక్టుల కోసం పని చేస్తాడని తానే చెప్పుకుంటున్నాడన్నారు. అతనికి ఓటు ఎందుకు వేయాలని ప్రశ్నించారు. తాను మాట ఇచ్చి తప్పే వ్యక్తిని కాదు కాబట్టే కరీంనగర్ లో ఐదు ఎన్నికల్లో వరుసగా గెలిపించారన్నారు అన్నారు. ఇక్కడి మాజీ ఎమ్మెల్యే ఎందుకోసం రాజీనామా చేసాడని, మునుగోడు సమస్యలైన శివన్న గూడెం చెరువు కోసం రాజీనామా చేసినవా… మేళ్ల చెరువు కోసం రాజీనామా చేసినవా… ముదిరాజ్ సొసైటీ కోసం రాజీనామా చేసినవా అని మంత్రి గంగుల ప్రశ్నించారు. ఐదు సంవత్సారాలు మన కోసం పోరాడుతాడు అనే మునుగోడు ప్రజలు ఓటేసి గెలిపించారన్నారు. వారి కోసం అసెంబ్లీలో అడుగుతాడు అని, మంత్రుల వద్దకు ప్రభుత్వం వద్దకు పనుల కోసం వెళ్లాలని గెలిపిస్తే దాన్ని గాలికొదిలేసి సొంత రాజకీయాలు చేస్తూ రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు కోసం రాజీనామా చేసిన వ్యక్తి రాజగోపాల్ రెడ్డి అన్నాడు. ప్రజలపై ఆర్థిక భారం మేపే ఉప ఎన్నిక ఎందుకోసం వచ్చిందో మునుగోడు ప్రజానీకం ఆలోచించాలన్నారు. నాడు ఓటేసి గెలిపించిన తర్వాత కనీసం ఒక్కసారైనా మిమ్మల్ని పలకరించాడా అని ప్రశ్నించాడు. ఏనాడు రాని వ్యక్తి మల్లీ నేడు ఓటేస్తే కనిపిస్తాడా అని, అలాంటి వ్యక్తి మనకు అవసరమా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాల్ని వివరించారు. ఈనెల 3న జరిగే ఎన్నికలలో కారుగుర్తుకు ఓటేసి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థాన్ నారాయణపురం ఎంపీపీ ఉమా ప్రెమ్ చంద్రారెడ్డి, ప్యాక్స్ ఛైర్మన్ జక్కిడి జంగారెడ్డి, నాయకులు, జక్కిడి దన్వంత్ రెడ్డి, ముదిరాజ్ సంఘం అధ్యక్షులు నిమ్మల నగేష్, సీపీఐ నాయకులు చిలువేరు అంజయ్య, బాలయ్య, గాలయ్య తదితరులతో పాటు కరీంనగర్ శ్రేణులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement