Friday, May 17, 2024

అంతరిక్షంలోకి ..ఒకేసారి 36బ్రాడ్ బ్యాండ్ శాటిలైట్లు

బ్రిటిష్ స్టార్టప్ వన్ వెబ్ కి చెందిన 36బ్రాడ్ బ్యాండ్ శాటిలైట్లని అంతరిక్షంలోకి ప్రయోగించనుంది.భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఈ నెల 23న (22 అర్ధరాత్రి తర్వాత) ఓ ప్రయోగం చేపట్టనుంది. ఇందుకోసం లాంచ్ వెహికల్ మార్క్ 3 (ఎల్వీఎం3)ని ఉపయోగించనుంది. ఎల్వీఎం3ని గతంలో జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ మార్క్ 3 అని పిలిచేవారు. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరికోట షార్ నుంచి ఈ ప్రయోగం జరగనుంది. ఇస్రోకి ఇది వాణిజ్య ప్రయోగం కానుంది. ఇస్రోకి చెందిన న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎస్ఐఎల్) ద్వారా దీన్ని నిర్వహిస్తోంది. ఈ మేరకు వన్ వెబ్, ఎన్ఎస్ఐఎల్ మధ్య ఒప్పందం కుదిరింది. వన్ వెబ్ బ్రిటిష్ స్టార్టప్ అయినప్పటికీ ఇందులో మెజారిటీ వాటాలు ఎయిర్ టెల్ ప్రమోటర్ అయిన భారతీ ఎంటర్ ప్రైజెస్ కు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement