Sunday, May 12, 2024

ప్రైవేట్ కు ధీటుగా సర్కారు బడులు: ఎమ్మెల్యే రేఖా నాయక్

ఉట్నూర్ జూన్20(ప్రభన్యూస్) ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన జరుగుతుందని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా శ్యామ్ నాయక్ అన్నారు దశాబ్ది తెలంగాణ రాష్ట్ర ఉత్సవాల్లో భాగంగా మంగళవారం విద్యా దినోత్సవం పురస్కరించుకొని ఉట్నూర్ లోని లక్కారం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు .ఈ సందర్భంగా పాఠశాలలో మన ఊరు మన బడి కార్యక్రమంలో నిర్మించిన రెండు గదులను ఆమె ప్రారంభించారు.

అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ
విద్య జీవితానికి తొలిమెట్టు అని నేడు రాష్ర్టంలో పేద మధ్య తరగతుల వారికి ఉన్నతమైన చదువును అందించటమే లక్ష్యంగా సీఎం కెసిఆర్ గారి మన ఊరు మన బడి కార్యక్రమంప్రారంభించార ని అన్నారు.దశల వారీగా డిజిటల్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని పెంచాలని ప్రభుత్వం భావిస్తోందని. దీనికోసమే మన ఊరు-మన బడిమన బస్తి-మన బడి పథకాన్ని ప్రభుత్వం ఆవిష్కరించింది అన్నారు

. ఉట్నూర్ ఎంఈఓ గంగుల శ్రీనివాస్ కుమార్తెలు గంగుల జ్ఞాన ప్రసూన ఎండిలో రెండో కూతురు జ్ఞాన ప్రభాస ఎంబిబిఎస్ లో మంచి ప్రతిభా ప్రతిభ కనబరిచి సీటు సాధించడంతో ఈ సందర్భంగా ఎంఈఓ శ్రీనివాస్ కు ఎమ్మెల్యే సన్మానం చేశారు అనంతరం పాఠశాలలో విద్యార్థులకు రాగి అంబలి పంపిణీ చేశారు. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు

- Advertisement -

అనంతరం ఊర్లో జరిగిన మాల సంఘం సమావేశంలో పాల్గొని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తుందని మాల సంఘ సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు

.ఈ కార్యక్రమంలో ఉట్నూర్ ఎంపీపీ పంద్రా జయవంత్రావు, వైసీపీ దావూలే బాలాజీ కోఆప్షన్ సభ్యులు రసీదు, ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీరామ్ జాదవ్ లక్కారం, సర్పంచ్ జనార్దన్ రాథోడ్ ఎంపీడీవో తిరుమల, ఎం పి ఓ కన్నాజి మహేష్ కుమార్, మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement