Friday, May 3, 2024

Delhi | నేరాంధ్రప్రదేశ్‌గా మారిన ఏపీ.. వైఎస్సార్సీపీ పాలనపై టీడీపీ ఎంపీ కనకమేడల ఆందోళన

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ నేరాంధ్రప్రదేశ్‌గా మారిపోయిందని టీడీపీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్రకుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన న్యూఢిల్లీలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ఏపీలో పరిస్థితులు చూసి ప్రజలు భయంతో వణికిపోతున్నారని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ పాలన, ఆధిపత్య ధోరణి, నేర ప్రవృత్తి దీనికి కారణమని కనకమేడల అభిప్రాయపడ్డారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రతిరోజూ ఏదో ఒక నేర సంఘటన జరుగుతూనే ఉందని అన్నారు. రాష్ట్రంలో అక్రమ గంజాయి, మహిళలపై అత్యాచారాలు, ప్రతిపక్ష నేతల అరెస్టులు… ఇలా ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయని రవీంద్రకుమార్ వాపోయారు.

- Advertisement -

ఎంపీ కుటుంబం కిడ్నాప్, అమర్‌నాథ్ అనే యువకుడిపై పెట్రోల్ పోసి కాల్చడం వంటి ఘోరాలు జరుగుతూనే ఉన్నాయని చెప్పారు. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు దాడులు, దౌర్జన్యాలు చేస్తున్నారని ఎంపీ ఆరోపించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు రాష్ట్రంలో తిరుగుతుంటే దాడులు చేస్తున్నారని, ఇన్ని గొడవలు జరుగుతుంటే సీఎం కనీసం మాట్లాడడం లేదని ఆయన విమర్శించారు. పోలీసులు వైఎస్సార్సీపీ సేవలో తరిస్తున్నారని ఆరోపించారు. ఓవైపు రాష్ట్రంలో ఇన్ని నేరాలు జరుగుతుంటే డీజీపి ఏపీలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని అంటున్నారని రవీంద్రకుమార్ మండిపడ్డారు.

గతంలో వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజును  కస్టోడియల్ టార్చర్‌కి గురి చేశారని గుర్తు చేశారు. తమ పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ పరిశ్రమలు నడుపుతుంటే ఆయనను ఇబ్బందులకు గురి చేయడంతో వారి కుటుంబం పక్క రాష్ట్రంలో పరిశ్రమ ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. సొంత ఎంపీ కుటుంబాన్ని కిడ్నాప్ చేశారని, మాచర్లల్లో తమ పార్టీ నేతను మర్డర్ చేశారంటే రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చని ఎంపీ రవీంద్రకుమార్ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement