Wednesday, May 8, 2024

Minister: అప్పు చేసి నాలుగు భ‌వ‌నాలు క‌డితే అది అభివృద్దా…బిఆర్ఎస్ పై పొంగులేటి చుర‌క‌లు

పాలేరు – అప్పులు చేసి భవనాలు కడితే అభివృద్దా? అని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వం పై మండిపడ్డారు. ప్రజలు కాంగ్రెస్ ను ఎందుకైతే అధికారం లోకి తెచుకున్నారో 100 కు 100 శాతం అమలు చేసి చూపుతామ‌న్నారు.

పాలేరులో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, అప్పులు కోట్లలో ఉన్నా కూడా మాట తప్పకుండా అమలు చేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం చేసిన తప్పును మేం చేయదల్చుకోవడం లేదన్నారు. మేం విడుదల చేసిన శ్వేత పత్రానికి వ్యతిరేకంగా స్వేద పత్రాలు విడుదల చేసారన్నారు. కరెంట్ విషయంలో నిలదీసిన వెంటనే లాక్ బుక్ లు మాయం చేశారని తెలిపారు.

ధరణి లో తప్పులున్నాయి అంటే కాంగ్రెస్ ను బంగాళాఖాతంలో వేయమన్నారని గుర్తు చేశారు. ప్రజలు ఎవరిని బంగాళాఖాతంలో వేశారో చూశాంగా అంటూ కామెంట్ చేశారు. 100 రోజుల్లో హామీలన్నీ నెరవేర్చే ఉద్దేశ్యంతోనే ఈ సమీక్షలు అన్నారు. జనాలు వాళ్ళ మాయ మాటలు నమ్మలేదన్నారు. ప్రజల కోసం సేవకులుగా పనిచేస్తామన్నారు. ఆర్ధికంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రజా గుమ్మానికి సంక్షేమ పథకాలను పంపిస్తామన్నారు. మీరు తిన్నదంతా ఎలా కక్కించాలో మాకు తెలుసంటూ బిఆర్ఎస్ ను హెచ్చ‌రించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement