Sunday, April 28, 2024

KomatiReddy: ల‌క్ష కోట్లు ఖ‌ర్చు చేసి ఫామ్ హౌజ్ నీళ్లుచ్చుకున్న ఘ‌నుడు కెసిఆర్ – కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి

ఖ‌మ్మం – లక్షల కోట్ల రూపాయలతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో ఒక ఎకరాకు నీళ్లు ఇవ్వలేదని, కానీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫాం హౌస్ కే నీళ్లు వచ్చాయని ఎద్దేవా చేశారు రోడ్లు భవనాల శాఖ, సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఖమ్మంలో కలెక్టరేట్ కార్యాలయంలో నేడు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఆయన మాట్లాడారు.

గత పాలకులు అసమర్థ పాలనతో ప్రతి శాఖ వేల కోట్ల రూపాయలు నష్టాలతో ఉందన్నారు. ఇన్నాళ్లు తెలంగాణ ధ్వంస‌మైద‌ని అన్నారు. ఏ శాఖ చూసిన వేల కోట్లలో అప్పులు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాన్ని గాడిలో పెట్టాలనే త‌మ‌ ఆత్రుత అన్నారు. తానే ఇంజినీర్ అని గొప్పలు చెప్పుకున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మీడియా సభ్యులు కూడా కాళేశ్వరం గొప్పలు, దిబ్బలు చూడొచ్చని అన్నారు. త్వరలో మా మంత్రులు సందర్శనకు వెళ్తున్నారని తెలిపారు. కాళేశ్వరం మాత్రం కమీషన్ కోసం హడావిడిగా ప్రారంభించారని తెలిపారు.

దేశంలోనే అవమానపర్చేలా కాళేశ్వరం నిర్మాణం ఉందంటూ ఆరోపించారు వెంక‌ట‌రెడ్డి. ఖమ్మం జిల్లాను వచ్చే 5 ఏళ్లలో 24/7 అభివృద్ధి కోసం కలిసి పని చేస్తామన్నారు. ముగ్గురు మంత్రులకు, ఇన్చార్జి మంత్రిగా తోడుగా వుంటానని అన్నారు. మంత్రి తుమ్మల ఖమ్మం జిల్లాలో రోడ్లు అన్ని కవర్ చేశారని..ఇంకా మిగిలిన వున్న వాటిని పూర్తి చేస్తామన్నారు. తాము ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 6 గ్యారెంటీల అమల్లోకి తెచ్చేందుకు ఈ రివ్యూ అని క్లారిటీ ఇచ్చారు. నెల గడవకముందే గ్యారెంటీల అమలు దేశ చరిత్రలో ఇదే మొదలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement