Wednesday, May 8, 2024

సీఎం కెసిఆర్ అధ్వర్యంలో రామరాజ్యం

రాష్ట్ర ప్రజలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. రాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయుడు ప్రపంచానికి ఆదర్శప్రాయులన్నారు. శ్రీరామ నవమిని ప్రజలు భక్తి, శ్రద్ధలతో జరుపుకోవాలని, ఆ సీతా రాముల కరుణా కటాక్షాలకు పాత్రులు కావాలని ఆకాంక్షించారు. శ్రీరాముడు తన జీవితమంతా ధర్మం కోసం నిలబడ్డాడని, అందుకే ఆయన ప్రపంచానికి ఆదర్శంగా నిలిచాడని చెప్పారు. అందువల్ల రామాయణం నిత్య పారాయణ కావ్యంగా మారిందన్నారు. జీవితమంతా ధర్మం కోసం నిలబడిన మహా పురుషుడు శ్రీరామచంద్రుడు అని కొనియాడారు. తెలంగాణ వచ్చాకే సీఎం కెసిఆర్ నేతృత్వంలో పండుగలకు ప్రాధాన్యం ఏర్పడిందని చెప్పారు. గత పాలనలో నిర్లక్ష్యానికి గురైన మన దేవాలయాలకు పూర్వ వైభవం వచ్చిందన్నారు. సీతా రాముల కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతున్నదని, రాష్ట్రంలో రామరాజ్యం నడుస్తున్నదని చెప్పారు. ప్రజలందరి జీవితాల్లో ఆనందం వెల్లివిరుస్తుందన్నారు. ఈ పాలన కలకాలం కొనసాగి, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని మంత్రి ఎర్రబెల్లి ఆకాంక్షించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement