Monday, May 6, 2024

తొర్రూరులో మెగా జాబ్ మేళా.. కంపెనీలకు అభినంద‌న‌లు తెలిపిన మంత్రి ఎర్ర‌బెల్లి

సీఎం కేసీఆర్ సారథ్యంలో, మంత్రి కేటీఆర్ కృషి వల్ల తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధిచ‌ సంక్షేమాలతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగాయని.. హైదరాబాద్ మహానగరం విశ్వ నగరంగా రూపుదిద్దుకొని, ప్రపంచం చూపు ఇప్పుడు భాగ్యనగరం పైనే ఉందన్నారు మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు. దేశంలోనే రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందన్నారు. కాగా, మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ పట్టణంలో జిల్లా పోలిస్ శాఖ ఆధ్వ‌ర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాలో ఎంపికైన అభ్యర్థులకు మంత్రి నియామక పత్రాలను అందజేశారు.

రాష్ట్రంలో మంత్రి కేటీఆర్ అభివృద్ధిని హైదరాబాద్ కే పరిమితం చేయకుండా జిల్లాలకు విస్తరిస్తుండటంతో ఐటీ, వస్త్ర, తదితర పరిశ్రమలు జిల్లాలకు వస్తున్నాయని మంత్రి ఎర్ర‌బెల్లి అన్నారు. ఆ విధంగా ఇప్పటికే వరంగల్ జిల్లా కేంద్రానికి పలు పరిశ్రమలు వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. మరోవైపు తెలంగాణ యువ‌త ఎంచుకున్న రంగాల్లో నైపుణ్యాలు పెంచుకోవాలి. నైపుణ్యం ఉన్న యువ‌త‌కు ఉపాధి అవ‌కాశాలు చాలా ఉన్నాయ‌న్నారు. తొర్రూర్ మెగా జాబ్ మేళాలో పాల్గొని.. ఇక్క‌డి యువ‌త‌కు ఉపాధి అవ‌కాశాలు క‌ల్పిస్తున్న ఆయా కంపెనీల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

ఈ జాబ్ మేళాలో  ఫార్మా, ఐటి, బ్యాంకింగ్, ఆమెజాన్, ప్లిప్ కార్ట్, హస్పిటల్ ఇండస్ట్రియల్, ఫైనాన్స్, నిర్మాణ రంగాలకు చెందిన 53 కంపెనీలు ఆయా రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించాయి. జిల్లాలోని 8మండలాలకు చెందిన 1,517 మంది పాల్గొనగా.. 541 మంది వివిధ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు పొందారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement