Sunday, May 5, 2024

గోపిలతను విధుల్లోకి తీసుకోవాలి..

నాగర్ కర్నూల్ : జిల్లా కోడెరు కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయం (KGBV) లో ప్రత్యేకాధికారిణి (S.O.) గా విధులు నిర్వహిస్తున్న గుంటి గోపిలత దీర్ఘకాలంగా తాము ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం ఆశించి భంగపడ్డ బాధ, ఆవేదనతో నిరసన తెలియజేశారు. నిరసన ప్రజాస్వామిక హక్కు అనే విషయాన్ని విస్మరించి కక్షపూరితంగా రక్తాభిషేకం అభియోగంతో ఉద్యోగం నుంచి తొలగించిన అధికారుల ఏకపక్ష విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అభిషేకాల సంస్కృతి సరైంది కానప్పుడు పాలాభిషేకం చేసిన వారిపై కూడా చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సింది పోయి, రాజకీయ వివక్షకు పాల్పడడం సరికాదు.నిరసన అనే ప్రజాస్వామిక , రాజ్యాంగ హక్కును గౌరవించి గోపిలత గారిపై చేపట్టిన నిరంకుశ చర్యలను ఎత్తివేసి తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని అధికారులను డిమాండ్ చేస్తున్నాం. కేజీబీవీ జగదేవపూర్ ముందు జరిగిన కార్యక్రమం లో నేతి. శంకర్ అధ్యక్షులు,మరియు నాయకులు అంకం వెంకటేశ్వర్లు, జలంధర్ రెడ్డి, సోమాచారి, కేజీబీవీ ఎస్ ఓ ఉమామహేశ్వరి, విజయలక్ష్మి, చంద్రకళ,సుస్మిత, పుష్ప,మల్లీశ్వరి, మాధురి, ప్రవంతి, శ్రీలత,
పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement