Thursday, May 16, 2024

బడ్జెట్ పాఠశాలల సమస్యలపై గ‌ళం విప్పిన ఎమ్మెల్యే వివేకానంద‌..

-స్పందించిన విద్యాశాఖ మంత్రి…
-త్వరలోనే పరిష్కారం చూపుతామని హామీ…

కుత్బుల్లాపూర్ – తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా జీరో అవర్ లో బడ్జెట్ పాఠశాలల యాజమాన్యాలు ఎదుర్కొంటున్న సమస్యలపై అసెంబ్లీలో సోమవారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గౌడ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి దృష్టికి సభ ద్వారా తీసుకువచ్చారు.. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 12 వేల ప్రైవేట్ పాఠశాలలు ఉంటే అందులో 10వేల వరకు బడ్జెట్ పాఠశాలలు ఉన్నాయని, జిహెచ్ఎంసి పరిధిలోనే 5,750 బడ్జెట్ పాఠశాలలు ఉన్నాయన్నారు. ఈ పాఠశాలల్లో సుమారు 20 లక్షల మంది విద్యార్థులు చదువుతుంటే, ఒక లక్ష నలభై మూడు వేళ మంది ఉపాధ్యాయులు బోధిస్తున్నారని అన్నారు. ఈ బడ్జెట్ పాఠశాలలను ఇంటర్నేషల్ స్కూల్స్, కార్పొరేట్ స్కూల్స్, బడ్జెట్ స్కూల్స్ ను ఫీజుల వారీగా క్యాటగరైజేషన్ చేయని మూలాన కార్పొరేటర్ పాఠశాలలకు వేసే టాక్స్ ను బడ్జెట్ పాఠశాలలకు వేయడంతో వీరు అనేక ఇబ్బందులు పడుతున్నారని సభ దృష్టికి తీసుకువచ్చారు. బడ్జెట్ పాఠశాలాన్ని పేద, మధ్య తరగతి ప్రజలు నివసించే ప్రాంతాల్లో ఉన్నాయని, సుమారు 300 బడ్జెట్ పాఠశాలలు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోనే ఉన్నాయని అన్నారు. ఈ సమస్యల పరిష్కారంకు క్యాటగరైజేషన్ అమలు చేయాలని, ఆస్తిపన్నుపై సమీక్షించి, వాణిజ్యేతర విధానాన్ని ప్రవేశపెట్టాలని ఉపసభాపతి ద్వారా సంబంధిత మంత్రి ని కోరారు. అలాగే విద్యుత్, నీటిని కమర్షియల్ నుండి డొమెస్టిక్ గా మార్చాలని, కరోనా లాక్ డౌన్ వల్ల సుమారు 10 నెలలు పాఠశాలలు అన్నీ పూర్తిగా మూసివేయడం కారణంగా టాక్స్ కూడా కట్టలేని పరిస్థితుల్లో ఈ బడ్జెట్ పాఠశాలలు ఉన్నాయని, ఈ సంవత్సరానికి జిహెచ్ఎంసి పరిధిలోని పేద, మధ్య తరగతి ప్రజలు నివసించే ప్రాంతాల్లో ఉన్న బడ్జెట్ పాఠశాలలకు టాక్స్ ను రద్దు చేయాలని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కోరారు. అలాగే బడ్జెట్ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులకు కరోనా పరిస్థితుల దృష్ట్యా జీతాలు లేక ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారని వారికి ప్రభుత్వం ఆదుకొని రూ.6 వేలు నిరుద్యోగ బృతి కింద విద్యాశాఖ ద్వారా అందించాలని కోరగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందిస్తూ…   విద్యాశాఖ, మున్సిపల్ శాఖ, విద్యుత్ శాఖలకు సంబంధించిన అంశాలు కాబట్టి తప్పకుండా సమీక్షించి సమస్యలకు త్వరలో పరిష్కారం చూపుతామన్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement