Monday, April 29, 2024

భారీగా అక్రమ మద్యం బాటిల్స్ ధ్వంసం

వెల్దుర్తి : నాలుగేళ్ల క్రితం సాధారణ ఎన్నికల్లో కట్టుబడిన అక్రమ మద్యాన్ని బుధవారం మండల కేంద్రమైన వెల్దుర్తిలో ఎక్సైజ్ జిల్లా సూపరిండెంట్ రజాక్ ఆధ్వర్యంలో, అధికారులు ధ్వంసం చేశారు. సూపర్డెంట్ రజాక్ తెలిపిన వివరాల ప్రకారం 2018 సాధారణ ఎన్నికల్లో కౌడిపల్లి మండల కేంద్రానికి చెందిన రోజా రెడ్డి వైన్స్ సంబంధించిన మద్యాన్ని వెల్దుర్తి మండల పరిధిలోని ధర్మారం గ్రామంలో అక్రమంగా నిలువమించినట్లు సమాచారం అందిందన్నారు.

నమ్మదగిన సమాచారం ప్రకారం వెల్దుర్తి పోలీసులు ధర్మారం గ్రామానికి వెళ్లి అక్రమంగా దాచిన 83 కేసుల ఎంసీ విస్కీ మద్యాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. విచారణ అనంతరం ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఆదేశాల మేరకు బుధవారం వెల్దుర్తి గ్రామ శివారు బండకుంట సమీపంలో 83 కేసుల మద్యాన్ని కింద పారబోసి సీసాలను జేసీబీతో ధ్వంసం చేశారు. 83 కేసులలో 3984 బాటిల్లో ఉంటాయని వాటి విలువ నూతన ధర ప్రకారం ఏడు లక్షల 56 వేల 960 రూపాయలు ఉంటాయని అన్నారు. వెల్దుర్తి పీఎస్ పరిధిలో కేసు నమోదు అయినందున గ్రామ పరిధిలో మద్యాన్ని ధ్వంసం కార్యక్రమంలో రామాయంపేట ఎక్సైజ్ ఎస్సై విజయ్ సిద్ధార్థ వెల్దుర్తి ఏఎస్సై వసురాం, ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement