Tuesday, May 14, 2024

అన్ని వర్గాల సంక్షేమం కోసం పనిచేసిన గొప్ప వ్యక్తి జగ్జీవన్ రామ్ : హ‌రీశ్ రావు

అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం పనిచేసిన గొప్ప వ్యక్తి జగ్జీవన్ రామ్ అని రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు కొనియాడారు. బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో భాగంగా సిద్దిపేట పట్టణంలోని బీజేఆర్‌ కూడలిలో జగ్జీవన్ రామ్ విగ్రహానికి మంత్రి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ డా.బీఆర్‌ అంబేద్కర్‌, బాబు జగ్జివన్ రామ్ కలలను నిజం చేస్తున్నారన్నారు. జగ్జీవన్ రామ్ ఎన్నో పదవులు సుదీర్ఘ కాలం అనుభవించినా చాలా నిరాడంబర జీవితం గడిపారన్నారు. గాంధీజీ ఎన్నో సందర్భాల్లో జగ్జీవన్ రామ్‌ను కొనియాడారని గుర్తు చేశారు. ఆ మహనీయుల ఆశయాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్‌ తెలంగాణలో పాలన కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement