Saturday, May 4, 2024

భూమిని, నీటిని కాపాడుకోవడం మన బాధ్యత

తెలంగాణ మోడల్ స్కూల్‌లో పట్టణ దట్టమైన అడవులను (5000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 1000 చెట్లు) అభివృద్ధి చేసే ప్లాంటేషన్ కార్యక్రమం చేప‌ట్టారు. ఈ సందర్భంగా తెల్లాపూర్ మున్సిపల్ కమీషనర్ బి.శ్రీనివాస్ మాట్లాడుతూ భూమిని కాపాడేందుకు, నీటిని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. వెలిమెల భూమిని కాపాడుకోవడం, నీటిని కాపాడుకోవడం మన బాధ్యత అని ఆయన అన్నారు. ఎక్స్ నోరా(ExNoRa) భాగస్వామ్యంతో, ఏజీఎస్ హెల్త్(AGS HEALTH) ద్వారా స్పాన్సర్ చేయబడిన చెన్నై ఆధారిత స‌త్సంగ్ (SATSANG) ఫౌండేషన్ ఈ ప్లాంటేషన్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఒకటిన్నర సంవత్సరాలలో పట్టణ దట్టమైన అడవి వస్తుంద‌న్నారు. పాఠశాల ఆవరణలో వనం ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపడం పట్ల అతిథులంతా హర్షం వ్యక్తం చేశారు. అర్బన్ దట్టమైన అటవీ అభివృద్ధికి ఈ పాఠశాలకు ప్రాధాన్యతనిచ్చినందుకు మూడు సంస్థలు, మున్సిపల్ కార్యకర్తలకు ప్రిన్సిపల్ రామ్ ప్రసాద్ ధన్యవాదాలు తెలిపారు. తోటల పెంపకానికి అన్ని విధాలా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈరోజు అతిథులు, విద్యార్థులు 500 మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో తెల్లాపూర్ మున్సిపాలిటీ క‌మిష‌న‌ర్ బి.శ్రీనివాస్, మున్సిపల్ కౌన్సిలర్ పి.రవీంధర్ రెడ్డి, ఎస్. సెంతుర్ పూరి, నేహా గుప్తా, ప్రణవ్, షాహిస్తా, ప్రవీణ్, సంగీతా మీనన్, రాధ, తెలంగాణ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ ఎ. రామ్ ప్రసాద్, మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement