Sunday, April 28, 2024

వైకుంఠ వైభవం

మనం తరచూ స్వర్గం, నరకం, వైకుంఠం, కైలాసం, వంటి వాటిని తలుస్తూంటాము. వైకుంఠములో లక్ష్మీ సమేతుడై శ్రీమన్నారాయ ణుడు, కైలాసంలో ఆది దంపతులు శ్రీ పార్వతీ సమే తుడై మహేశ్వరుడు కొలువై ఉంటారని, వాళ్ళ నివా స స్థానాలు అవేనని మనకు తెలుసు. మన మిత్రుడో, బంధువో కొత్తగా ఇల్లు నిర్మించుకొంటేనే మనం ఆసక్తి గా, పరిశీలనతో చూసి ఆనందిస్తాం. అటువంటిది సాక్షాత్తు శ్రీమహావిష్ణువు లక్ష్మీ సమేతుడై నివసించే వైకుంఠం గురించి తెలుసుకుందాం.
శ్రీ పోతనామాత్యుడు తన భాగవతంలోని గజేంద్ర మోక్షము ఉపాఖ్యానంలో ఒకచోట —
”అల వైకుంఠ పురంబులో నగరిలో నా మూల సౌథంబు దా
పల మందారవనాంతరామృతసర:
ప్రాతేందుకాంతో పలో
త్పల పర్యంక రమా వినోది యగు నా పన్న ప్రసన్నుండు వి
హ్వల నాగేంద్రము పాహిపాహి యనుగుయ్యాలించి
సంరంభియై”
అని కొద్దిగా వైకుంఠాన్ని వర్ణించారు. ఈ పద్యం లో రెండోలైను పోతనామాత్యుడు వైకుంఠ వర్ణన తట్టకపోతే, సాక్షాత్తు శ్రీరాముడే వచ్చి ”మందార వనాంతరామృతసర: ప్రాతేందు కాంతోపలోత్పల- సంరంభియై అని పూరించాడని పెద్దలందరూ చెపు తారు. ఇంతకీ ఆ వైకుంఠం ఎలా ఉందంటే (పోతన గారి మాటల్లో అది వైకుంఠం. అందులో రాచనగరం. ఆ నగరం మూలగా పెద్ద భవనం. ఆ ప్రక్కనే మందార మొదలగు పూలవనం, ఆ పూల వనం మధ్యలో ఒక అమృత సరస్సు. ఆ సరస్సును ఆనుకొని
చంద్రకాంత మణి వేదిక. ఆ వేదిక మీద కలువ పూల పాన్పు. ఆ పాన్పుపై మహాలక్ష్మితో సరసాలాడు తూ శ్రీమన్నారాయణుడు. ఎంతో సొగసుతో ఒప్పా రుతోంది వైకుంఠం.
ఇంకా వైకుంఠం లోపల ఎలా ఉందో చూద్దాం-
ఒకసారి సనకసనందనాదులు భక్తితో పద్మనా భుని దర్శించాలనే ఉద్దేశంతో వైకుంఠం చేరుకొన్నా రు. వైభవోపేతమైన వైకుంఠం చూసి ఆశ్చర్యపోయా రు. దివ్యమైన శోభతో, దేదీప్యమానంగా మనోహరంగా ఉంది. ఇక్కడ ప్రవేశించిన భక్తులకు పునర్జన్మ లేదు. కైవల్యం కాంక్షించే వారు నిరంతరం హరినామ సంకీర్తన చేస్తూ, ఆనందరూపులైన వారు వైకుంఠం చేరగలరు.
శ్రీ మహావిష్ణువు త్రిగుణాతీతుడు. సర్వాంతర్యా మి. అజుడు. ఆద్యంతరహితుడు. అనంత శక్తి సంప న్నుడు. వేదాంత వేధ్యుడు. ధర్మస్వరూపుడు. భగ వంతుడైన దేవదేవుని సేవలో వైకుంఠంలోని ప్రతీ వారు నిమగ్నులై ఉంటారు. సదా శ్రీహరి నామ సంకీర్త నమే వినపడుతూంటుంది.
వైకుంఠంలో ఉద్యానవనం ఉందని పైన తెలుసు కొన్నాము. ఆ ఉద్యానవనం పేరు ”నైశ్శ్రేయసం”. ఆనందాన్ని ఇస్తూ మోక్షాన్ని మూర్తీభవించేదిగా ఉంది. ఆ వనంలో ఎన్నెన్నో కల్ప వృక్షాలు. స్వేచ్ఛగా పెరిగి, పూల సుగంధం వాసనలతో, పండ్లతో, శోభాయమానంగా ఉంది. అన్ని ఋతువులలో శోభిల్లుతూ శ్రీహరి భక్తుల కోర్కెలు కొరత లేకుండా తీరు స్తూ ఉంది. వసంత ఋతువులో కొల్ల లుగా విరబూసిన మొల్ల పూలు సుగం ధంతో కూడిన మకరందం బిందువులను అందలి మంద మారుతాలు నలుమూలల వెదజల్లుతూ ఉంటాయి.
తమ తమ రమణీయ మణులతో కలిసి విహరించే గంధర్వులు- ఆ తేనె సోనలకు సంతోషపడి, మైమరచి, మహానుభావుడైన విష్ణు దేవుని కథలు చెప్పుకోవడం, గానాలాపన చేయడం జరుగుతోంది. ఆనందం అంతరంగాల్లో పొంగి పొరలేటట్లు ధ్వను లు చేస్తూ రంగురంగుల పావురాలు, హింసలు, చిలు కలు, కోకిలలు, వాన కోయిలలు, తీతువు పిట్టలు, నెమళ్ళు, చక్రవాకలు మొదలైన పక్షుల కోలాహలాన్ని మించి, కమలాక్షుని కథాగానాలు అఖంఢంగా జరుపు తున్నట్లు గండు తుమ్మెద గుంపులతో, నిండిన మేలు జాతి పూలతీగలు కన్నుల విందు చేస్తూంటాయి. వందనీయ చరిత్రుడైన వైకుంఠ ధాముని కంఠంలో వనమాలికగా వెలసిల్లడానికి తులసి ఎంతటి తపస్సు చేసిందో!
అని ఆనందంతో అభినందిస్తూన్నట్లు మంచి గంధపుచెట్లు మందారాలు, మల్లెలు, పొన్నలు, పొగడలు, కలువలు, పారిజా0తాలు, గుత్తుగుత్తులు గా పూసి తులసీ వనమాలలతో కలిసి సుగంధాలు విరజిమ్ముతున్నాయి.
ఒత్తుగా పూచిన పూలగుత్తులు వెదజల్లే పొద రిండ్లలో ఎత్తైన స్తన కుంభాల భారానికి నకనకలా డుతూ, విరహంతో సన్నని నడుము గల కొందరు సుందరీమణులు విహరిస్తూ ఉంటారు.
ఆ లతాంగులు నీలి రంగు పట్టుచీరలు కట్టుకొని, బంగారు గజ్జెల ఒడ్డాణాలు సింగారించుకుని, ఉన్నం దున వచ్చే సౌందర్యం చూసినా, వారితో శంగార క్రీడావిలాసాలను ఆశించక వారితో కలిసి గంధర్వు లు, హరి భక్తులు, గోవిందచరణారవింద సంసేవనం వల్ల సంప్రాప్తించిన, పుణ్యం వల్ల నవరత్నాలతో చెక్కి న, చక్కని బంగారు విమానాలు ఎక్కి వైకుంఠంలో ఉన్న పుణ్యప్రదేశాల సంచారం చేస్తూ ఉంటారు.
అందాల దీవి అయిన మహాలక్ష్మి మూడు లోకా లలోని సౌందర్యం మూర్తీభవించినట్లుగా, ఘల్లు ఘల్లుమనే మణులు చెక్కిన కాలి అందెలు మ్రోగు తూండగా, తన హదయ నాథుడైన శ్రీహరి మంది రంలో సంచరిస్తూ ఉంటుంది. ఆ ఇందిరాసుందరి తన వనంలో పరిమళాలు వెదజల్లే తులసీదళాలతో దండను కట్టి వైకుంఠనాథుని పాదపద్మాలకు అర్పిం చుతూ ఉంటుంది. ఆ సమయంలో శ్రమ బిందువులు వల్ల నుదుటిపై ఉన్న కస్తూరీ తిలకం కరిగి అంటుకొని కదులుతున్న ముంగురులుతో, నువ్వు పువ్వు
వంటి చక్కదనాల ముక్కెరతో, ముద్దులు మూట కట్టినట్లు కనపడే ఆమె ముఖ పద్మం, అచటి కోనేటి నీటిలో ప్రతిబింబిస్తూ కోనేటికే సొగసు తెచ్చింది. అప్పుడామె నీలమేఘ
శ్యాముడైన పరంధాముడు తన ముఖాన్ని ముద్దాడుతున్నట్లుగా భ్రమించి, సిగ్గుతో తలవంచు కొంటుంది. ఈవిధంగా హృద్యాతి హృద్యమైన ఆ ఉద్యానవనం- పుణ్యానికి ఆస్థానమై, సుకృతాలకు మూలస్థానమై వెలుగొందుతూ ఉంటుంది.
విష్ణు సేవకు విముఖులైనవారు, ఇతర లౌకిక విషయాలతో, సతమతమయ్యే, మనసు కలవారు, పాపపు నడవడి కలవారు, నరక హితువులైన దుష్క ర్మలు చేస్తూ ,చెడు కథలయందు, విషయాల యం దు, ఆసక్తి కలిగి మెలిగేవారు, భగవంతుని పాద పద్మాలను సేవించే భక్తులు ఉండే ఆ పవిత్ర ప్రదేశానికి ప్రవేశం ఉండదు కాక ఉండదు.
నారాయణుని దివ్య మంగళ లీలా విలాసాల తోను, పలుమార్లు తలుస్తూ ఆలపించడం వల్ల పెల్లు బికిన ఆనంద భాష్పాదులు చెక్కిళ్ళపై జారి, కంఠం గద్గదమై, మేను పులకించిన వారు, వైరాగ్య భావనతో భజించినవారు,
అ#హంకారాన్ని దూరంగా త్యజించిన వారు, పుణ్యాత్ములకు పుట్టినిల్లు అయిన వైకుంఠం లో ఉంటారు. లోకోత్తరమైన వైకుంఠపురమే- ఒక సరోవరం దివ్యత్వం దీపించే బంగారు
మంటపాలలో, గోపురాలతో, మేడలతో, కూడిన ఆ మహా మందిరమే వన్నెతో వెలుగొందుతూ ఉంది. ఆ సరస్సు నడుమ ఉన్న పద్మం ఆ మందిరం మధ్య భాగాన ఉన్న ప్రకాశించే ఆదిశేషుడే తామరదుద్దు. శేషతల్పంపై శయనించి ఉన్న మాధవుడే తుమ్మెద. ఈవిధంగా మహావిష్ణువు నివశించే వైభవోపేతమైన, శోభిల్లే వైకుంఠాన్ని సనకసనందదాదులు తమ యోగశక్తివల్ల అంతా సందర్శించారు.
వైకుంఠంలో ఎటువంటి వారికి ప్రవేశము ఉం టుందో తెలుసుకొన్నాము కదా! మనం కూడా ఆ దిశగా వెళ్ళడానికి తగిన మార్గం చూపించమని ఆ శ్రీ హరినే శరణాగతి వేడుకుందాము.

  • అనంతాత్మకుల రంగారావు 7989462679
Advertisement

తాజా వార్తలు

Advertisement