Sunday, April 28, 2024

TS : 16 కార్పొరేషన్ల ఏర్పాటు చరిత్రాత్మక నిర్ణయం… నీలం మధు ముదిరాజ్

ఉమ్మ‌డి మెద‌క్ బ్యూరో, ప్ర‌భ‌న్యూస్ : 16 కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు నీలం మధు ముదిరాజ్ అన్నారు. 16 కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం హర్షిస్తూ చిట్కుల్ లోని తన క్యాంపు కార్యాలయంలో రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.

ఈ సందర్భంగా నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ ఇందిరమ్మ స్ఫూర్తితో రాష్ట్రంలో పాలన కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తున్నారన్నారు.16 కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం ద్వారా ఆయా కులాల వారందరికీ చేయూత దొరుకుతుందన్నారు. కుల మత భేదం లేకుండా అన్ని వర్గాల ప్రజలకు సమ ప్రాధాన్యం దక్కాలనే సదుద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 16 కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ తీసుకున్న నిర్ణయన్ని తెలంగాణ సమాజం స్వాగతిస్తుందన్నారు. ముదిరాజ్ కులస్తుల చిరకాల స్వప్నమైన ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు ప్రభుత్వానికి రుణపడి ఉంటామన్నారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సమయంలో ఏఐసీసీ ఇంచార్జి దీపా దాస్ మున్షీ తో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటుతోపాటు బీసీడీ నుంచి బీసీఏలోకి మార్చలని విన్నవించడం జరిగిందన్నారు.

- Advertisement -

ఈ విషయంలో సానుకూలంగా స్పందించిన వారిద్దరూ స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలోనే 16 కార్పొరేషన్ ల ఏర్పాటులో ముదిరాజ్ కులానికి సైతం కార్పొరేషన్ ఏర్పాటు చేశారని స్పష్టం చేశారు. ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటుతో ముదిరాజ్ కులస్తులకు సామాజికంగా ఆర్థికంగా న్యాయం జరుగుతుందని తెలిపారు. రాబోయే రోజుల్లో అందరి సహకారంతో కార్పొరేషన్ ను మరింత బలోపేతం చేసుకుని ముదిరాజ్ యువతకు చేయూతని అందించే విధంగా కృషి చేస్తామని వెల్లడించారు.త్వరలోనే ముదిరాజ్ కులస్తులందరూ కోరుకుంటున్న విధంగా బీసీ “డీ” నుంచి బీసీ “ఏ” లోకి మార్చే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటుతో ముదిరాజులంతా కాంగ్రెస్ పక్షాన నిలబడాలని వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో 17 స్థానాలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.ముదిరాజ్ సామాజిక వర్గ పక్షాన కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రి వర్గానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యాదయ్య,రాములు,వెంకటేశ్,మురళి, కృష్ణ,ప్రభు,గోపాల్,అశోక్,శ్రీను,వెంకటేశ్, రాజ్ కుమార్,అంతయ్యా,కార్యకర్తలు,ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement