Friday, May 10, 2024

MDK : కాంగ్రెస్‌లోకి బీఆర్ఎస్ నేత‌లు

గజ్వేల్, ఏప్రిల్ 28 (ప్రభ న్యూస్): గ‌జ్వేల్ నియోజ‌క‌వ‌ర్గంలో కాంగ్రెస్‌లోకి బీఆర్ఎస్ పార్టీ నేత‌లు వ‌ల‌స‌ల బాట ప‌ట్టారు. బీఆర్ఎస్‌కు చెందిన కీల‌క నేత‌లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా గజ్వేల్ మండలం దిలాల్ పూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత వెంకన్నగారి వెంకట్ రెడ్డి, పిడ్‌చెడ్‌ గ్రామానికి చెందిన తాజా మాజీ సర్పంచ్ శిల్ప అశోక్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేతలు పిట్ల రాములు, నరసింహారెడ్డి తదితరులు కాంగ్రెస్‌లో చేరారు.

- Advertisement -

వారికి సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే టి. నర్సారెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం నర్సారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీ నేతలు కాంగ్రెస్ లో చేరుతున్నారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement