Sunday, May 5, 2024

చిట్కుల్‌ చర్చిలో ప్రార్థనలు..

మెదక్‌ : దైవకుమారుడైన యేసుక్రీస్తు మానవాళి పాపాల నుంచి విముక్తి చేయటానికి లోకం కోసం శిలువనెక్కడాని, మానవునిగా జన్మించి దేవుడి కుమారుడైన యేసుప్రభు మానవ సహజమైన మరణాన్ని స్వీకరించాడని మెదక్‌ మండలం ర్యాలమడుగు సీఎస్‌ఐ పాస్టర్‌ జి. అబ్రహాం తెలిపారు. గుడ్‌ప్రైడే పురస్కరించుకొని మండల పరిధిలోని ఆయా చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల కోసం శిలువనెక్కి రక్షకుడిగా నిలిచాడు. లోకరక్షకుడిగా మళ్ళీ సజీవుడిగా దర్శనమిస్తాడని సందేశాన్నిచారు. గుడ్‌ఫ్రైడే పురస్కరించుకొని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సీఎస్‌ఐ చర్చిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వల నిర్ణయం మేరకు కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ గుడ్‌ఫ్రైడే వేడుకలు నిర్వహించారు. మొదటగా మత గురువులు యేసుక్రీస్తు శిలువను తీసుకువచ్చి మొదటి ఆరాధనను ప్రారంభించారు. ఈ సందర్భంగా యేసుక్రీస్తు ప్రభువును శిలువపై మరణించిన రోజున గుడ్‌ఫ్రైడేగా ఆచరిస్తామన్నారు. శిలువపై మరణించినప్పుడు యేసుక్రీస్తు బాధపడుతూ ఏడు వ్యాఖ్యాలను జ్ఞాపకం చేస్తూ ప్రార్థనలు చేసుకుంటామన్నారు. కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ శానిటైజర్‌, మాస్కులు ధరించిన వారిని లోనికి అనుమతిస్తున్నామన్నారు. చర్చి ప్రాంగణంలోని భక్తుల సౌకర్యార్థం అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశారు. గుడ్‌ఫ్రైడే వేడుకలు ఎంతో ఉత్సహంగా, ఉల్లాసంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో చర్చి మత పెద్దలు పాల్గొన్నారు.
చిలప్‌చేడ్‌లో..
మండల కేంద్రమైన చిలప్‌చేడ్‌తో పాటు ఆయా గ్రామాల్లోని చర్చిలు శుక్రవారం గుడ్‌ఫ్రైడే సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మానవుల పాపాలను ప్రాలదోలేందుకు యేసుక్రీస్తు భూమి మిదికి రావడం జరిగిందని బైబుల్‌ చెబుతుందని పాస్టర్లు బోధించారు. 45 రోజులు ఉపవాస దీక్షలు చేపట్టిన క్రైస్తవులు గుడ్‌ఫ్రైడే సందర్భంగా చర్చిలో నిమ్మరసం తీసుకొని ఉపవాస దీక్షలు విరమించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement