Friday, April 26, 2024

పనిచేసే ప్రభుత్వాన్ని దీవించండి.. సిద్దిపేట అభివృద్ధిపై ప్రతిపక్షాలకు ఏడుపే : మంత్రి హరీష్ రావు

చిన్నకోడూర్ : పనిచేసే ప్రభుత్వాన్ని దీవిస్తే.. ఇంకా కష్టపడి పని చేస్తామని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు ప్రజలను కోరారు. సిద్దిపేట అభివృద్ధి పై ప్రతిపక్షాలు అందరికీ మనపై ఏడుపే ఉన్నదని మంత్రి విమర్శించారు. మండల కేంద్రమైన చిన్నకోడూర్ గ్రామ శ్రీ పెద్దమ్మ పెద్దిరాజుల 5వ కల్యాణ ఉత్సవంలో హాజరై అమ్మవారికి రాష్ట్ర మంత్రి హరీశ్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ముదిరాజ్ పెద్దమ్మ ఫంక్షన్ హాల్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. చిన్నకోడూర్ మండలాన్ని దినదినాభివృద్ధి చేస్తున్నామని, చిన్నకోడూర్ చుట్టూ ఎటూ చూసినా రెండు-నాలుగు వరుసలు రహదారి నిర్మాణం చేపడుతున్నట్లు, రూ.80 కోట్ల చిన్నకోడూర్ నుంచి సిద్ధిపేట వరకూ బట్టర్ ఫ్లై లైట్లతో నాలుగు లేన్ల రహదారి నిర్మాణం ప్రారంభం కానున్నట్లు మంత్రి తెలిపారు. ఏన్నో ఏళ్లుగా ఎప్పుడూ నిండని పెద్ద చెరువు.. కాళేశ్వరం నీళ్లతో 6 నెలల నుంచి మత్తడి దూకుతున్నదని, కాళేశ్వరం జలాలు రావడంతో రెండు పంటలు పండే పరిస్థితి ఏర్పడిందని వివరించారు. చిన్నకోడూర్ దవాఖాన, స్కూల్ భవనాల మరమ్మతులకు నిధులు మంజూరు చేసినట్లు, పెద్దమ్మ తల్లి 5వ వార్షికోత్సవం అత్యంత ఘనంగా ప్రారంభం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. మంత్రి వెంట గ్రామ సర్పంచ్ ఉమేష్, ఏంపీపీ మాణిక్ రెడ్డి రాష్ట్ర నాయకులు రాధాకృష్ణ శర్మ, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement