Friday, December 6, 2024

పుట్టిన రోజున మొక్క‌లు నాటిన హోం మంత్రి మ‌హ‌మూద్ అలీ..

హైదరాబాద్‌ : రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌ అలీ త‌న పుట్టిన రోజును నిరాడంబ‌రంగా నేడు జ‌రుపుకున్నారు..ఈ సంద‌ర్బంగా ఆయ‌నకు కెటిఆర్ తో స‌హా ప‌లువురు మంత్రులు, ప్ర‌జా ప్ర‌తినిధులు, అభిమానులు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు.. కాగా రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్‌ పిలుపు మేరకు తన జన్మదినం సందర్భంగా గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో భాగంగా రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌ అలీ మంగళవారం మొక్కలు నాటారు. మలక్‌పేట అజంపురాలోని జీహెచ్‌ఎంసీ పార్క్‌లో మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గాలి లేనిదే మనిషి లేడన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి, కాపాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు ఆజం అలీ, గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ కో ఫౌండర్‌ రాఘవ, కిశోర్‌ గౌడ్‌, మాజీ కార్పొరేటర్లు సింగిరెడ్డి స్వర్ణలతారెడ్డి, తీగల సునరీతారెడ్డి, భువనేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement