Friday, May 3, 2024

‘నాగార్జున’తో ‘శ్రీముఖి’..ఫొటోలు వైరల్

యాంకర్,నటి శ్రీముఖిని టాలీవుడ్ హీరో నాగార్జున హగ్ చేసుకున్నారు. నాగార్జున నటించిన లేటెస్ట్ చిత్రం వైల్డ్ డాగ్. ఈ చిత్రం రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ కోసం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ చిత్రానికి ప్రొడ్యూసర్  మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ నిరంజన్ రెడ్డి – డైరెక్టర్ అహిషోర్ సోలోమన్ – సయామీ కేర్ – ‘బిగ్ బాస్’ ఫేమ్ ఆలీ రెజా – రుద్ర ప్రదీప్ తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి యాంకర్ శ్రీముఖి  వ్యాఖ్యాతగా వ్యవహరించింది. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ కి వచ్చిన నాగార్జున వద్దకు నవ్వుతూ వచ్చిన శ్రీముఖి ఆయనతో ఆప్యాయంగా మాట్లాడి హగ్ చేసుకుంది. ప్రస్తుతం ఈ స్వీట్ హగ్ ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. శ్రీముఖి మాట్లాడుతూ ‘నాగ్ సర్ ముందు యాంకరింగ్ చేయాలంటే భయంగా ఉందని తెలిపింది. ఇక నాగ్ కూడా ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ శ్రీముఖి పేరును ప్రత్యేకంగా ప్రస్తావించారు. ”శ్రీముఖి నిన్ను చూసి చాలా రోజులైంది.. బిగ్ బాస్ నుంచి వచ్చాక మళ్ళీ కలవలేదు.. సంతోషంగా ఉంది.. నా మీద ఏమైనా కోపం ఉందా” అంటూ నవ్వుతూ అన్నారు. దీంతో ఆనందంతో ఉప్పొంగిపోయిన శ్రీముఖి ‘అదేమీ లేదు సర్’ అని బదులిచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement