Tuesday, May 7, 2024

పాలకుర్తిలో ఘనంగా సోమనాథకవి దీపారాధన..

పాలకుర్తి : మహాకవుల జన్మస్థలాలు ప్రపంచానికి జ్ఞానఫలాలు పంచే అక్షర కేదారాలు అన్నారు పంచాయతిరాజ్ శాఖామాత్యుడు ఎర్రబెల్లి దయాకర్ రావు. పాలకుర్తి శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థాన ప్రాంగణంలో దేవస్థానం మరియు సోమనాథ కళాపీఠం సంయుక్త నిర్వహణలో ఆదివారం జరిగిన పాలకురికి సోమనాథుని 782 వ లింగైక్య తిథి దీపారాధనలో దయాకర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సోమనాథుని విగ్రహానికి పూలమాల వేసి జ్యోతిప్రజ్వలన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. జ్ఞానసంపన్నుడైన సోమనాథుడు విశ్వకవి అని ఆయన కీర్తించారు. తెలుగు, దాక్షిణాత్య భాషలే కాక సంస్కృత, మరాఠీ భాషలలో సోమనాథుడు వ్రాసిన కవిత్వం ఆ మహాకవి బహుముఖీన ప్రజ్ఞకు నిదర్శనం అని కొనియాడారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ప్రత్యేక శ్రద్ధతో మహాకవుల జన్మస్థలాలైన పాలకుర్తి, బమ్మెర గ్రామాలను పర్యాటక అక్షరాభ్యాస జ్ఞాన స్ఫూర్తి కేంద్రాలుగా అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన వివరించారు. ప్రపంచ తెలుగు మహాసభలలో ప్రధాన ప్రాంగణానికి సోమనాథుని పేరు పెట్టిన విషయం ఆయన గుర్తు చేసారు. కార్యక్రమంలో సోమనాథ కళాపీఠం గౌరవ అధ్యక్షుడు డాక్టర్ రాపోలు సత్యనారాయణ, ఆలయ చైర్మన్ వెనుకదాసుల రామచంద్రయ్య శర్మ, దేవస్థానం కార్యనిర్వణాధికారి ఎం వీరస్వామి, ప్రధానార్చకుడు దేవగిరి రామన్న, సూపరింటెండెంట్ కొత్తపల్లి వెంకటయ్య, తెలంగాణ అర్చక మతైక ఉద్యోగుల జె ఏ సి కన్వీనర్ డి వి ఆర్ శర్మ, ఏ సి పి రమేశ్, సి ఐ చేరాలు, ఎస్ ఐ సతీశ్, టి ఆర్ ఎస్ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్, మార్గం లక్ష్మినారాయణ, కమ్మగాని నాగన్న, బండారి శ్రీనివాస్, దేవగిరి లక్ష్మన్న, మత్తగజం నాగరాజు, అనిల్ కుమార్, సంతోష్, శ్యాం, చిక్కమఠం పర్వతప్ప, రాపోలు శోభారాణి, ఇమ్మడి దామోదర్, మామిండ్ల రమేశ్ రాజా, గుమ్మడిరాజు సాంబయ్య, రాపోలు సోంసాయి, గూడూరు లెనిన్, బి అశోక్, ముంజె రాములు, మేరుగు మధుసూదన్, జి శ్రీనివాస్, కె సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement