Monday, May 6, 2024

అభివృద్ధిపై చర్చకు సిద్ధమా..

కోస్గి : మున్సిపాలిటీ అభివృద్ధిపై పోలీస్ స్టేషన్ వేదికగా చర్చకు సిద్ధమా అని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు వార్ల విజయ్ కుమార్ టీఆర్ఎస్ నాయకుల నుద్దేశించి అన్నారు. ఆయన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ కొడంగల్ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. గతంలో తాము చర్చకు సిద్ధమైనప్పటికీ అక్రమంగా అరెస్టు చేశారని, తాము మున్సిపాలిటీ అభివృద్ధిపై ముమ్మాటికి చర్చకు సిద్ధమేనని అన్నారు. ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి, వస్తారా లేదా తమ కార్యకర్తలను పంపిస్తారో చెప్పాలన్నారు. కాంగ్రెస్ ఎంపీ, కొడంగల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి హయాంలోనే మున్సిపాలిటీ అభివృద్ధికై నిధులు తీసుకువచ్చారని, దానిని ప్రస్తుతం అధికారంలో ఉన్న టిఆర్ఎస్ తాము నిధులను తీసుకువచ్చి అభివృద్ధి చేశామని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. గత నాలుగు సంవత్సరాల నుండి ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణంలోనే ఉందని, కోస్గి ప్రభుత్వ ఆసుపత్రికి రోజు వందల మంది వస్తుంటారని, ప్రభుత్వ ఆస్పత్రి నిర్మాణం పూర్తి చేయకపోవడం టిఆర్ఎస్ పాలనకు నిదర్శనమన్నారు. టిఆర్ఎస్ నాయకులకు అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉన్నట్లయితే తాము తెచ్చిన నిధులపై ప్రొసీడింగ్స్ చూపించాలని అన్నారు. మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ 15కోట్ల రూపాయలతో మున్సిపల్ ను అభివృద్ధి చేశామని చెప్పుకుంటున్న ఎమ్మెల్యే 15 కోట్లు ఎక్కడ నుండి వచ్చాయో చెప్పాలన్నారు. రేవంత్ రెడ్డి కొడంగల్ కు ఎమ్మెల్యే గా ఉన్నప్పుడే మున్సిపల్ అభివృద్ధికై 15 కోట్ల రూపాయలు కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ఇద్రీస్, భాను నాయక్, కాంగ్రెస్ నాయకులు రఘు వర్ధన్ రెడ్డి, ప్రభాకర్ , బె జూ రాములు, తుడుం శీను, శ్రీనివాస్ రెడ్డి, ఆసిఫ్, నాగులపల్లి సురేష్, రేవంత్ సైన్యం నరసింహ, నర్సింహులు తో పాటు తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement