Saturday, April 27, 2024

TS : కిక్కిరిసిన మునులకొండ… మన్నెంకొండ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి రథోత్సవం…

మహబూబ్‌న‌గర్, ఫిబ్రవరి 25 (ప్రభ న్యూస్): ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజల ఇలవేల్పు, పేదల తిరుపతిగా పిలవబడే మన్నెంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం తెల్లవారుజామున స్వామి వారి రథోత్సవం వైభవంగా కొనసాగింది. వేలాదిగా తరలివచ్చిన భక్తజనం నడుమ శ్రీలక్ష్మి వెంకటేశ్వర స్వామి రథంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.

కోనేటిలో భక్తులు స్నానాలు ఆచరించి భక్తిశ్రద్ధలతో స్వామివారి రథాన్ని లాగి గోవిందా గోవిందా అంటూ నామస్మరణ చేశారు. ఈ నేపథ్యంలో గోవింద నామస్మరణతో మునల కొండ కిక్కిరిసిపోయింది. ఉమ్మడి పాలమూరు జిల్లా నుండే కాక ఇతర రాష్ట్రాల నుండి భక్తులు వేలాదిగా తరలివచ్చి స్వామివారి కొండపై దాసంగాలు పెట్టి తలనీలాలు సమర్పించి రథోత్సవం కార్యక్రమంలో పాల్గొని ముక్కులు తీర్చుకొని పునీతులయ్యారు.

- Advertisement -

కొలిచి మొక్కిన వారికి కొంగుబంగారం శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామి-ఎమ్మెల్యే యెన్నం…
శ్రీశ్రీశ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామిని కొలిచి మొక్కిన వారికి కొంగుబంగారంగా స్వామి వారు భక్తులను అనుగ్రహిస్తున్నారని,స్వామి వారి కృప భక్తులందరిపైన సంపూర్ణంగా ఉండాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి ఆకాంక్షించారు. బ్రహోత్సవాల సందర్బంగా మన్యంకొండకు అశేషంగా తరలివచ్చే భక్త జనులకు అన్ని రకాల ఏర్పాట్లు చేయాలనీ, ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా స్వామి వారి దర్శనాన్ని కల్పించాలని ఆయన ఆలయ కమిటి సభ్యులను ఆదేశించారు.అదేవిధంగా రెవెణ్యు, మున్సిఫల్,వైద్య, పోలీసు శాఖ అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. అంతకుముందు మణ్యంకొండ దేవాలయ అర్చకులు, ఆలయ చైర్మెన్ అలహరి మధుసూదన్ శర్మ సిడబ్ల్యుసి ప్రత్యేక ఆహ్వానితులు చెల్లా వంశీ చంద్ రెడ్డి, ఎమ్యెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి,కలెక్టర్ రవినాయక్, మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ కు ఘన స్వాగతం పలికారు.ఆతరువాత గర్బాలయం నుంచి రథం వరకు ఊరేగింపుగా స్వామి వారి ఉత్సవ విగ్రహాలు తీసిుకు వచ్చి రంగురంగుల పువ్వులు,మామిడి తోరణాలతో అద్భుతంగా అలంకరించిన రథంపై స్వామివారిని కూర్చోబెట్టగా అనంతరం జిల్లా కలెక్టర్ రవి గుగులోత్, సిడబ్యుసి ప్రత్యేక ఆహ్వనితులు వంశీచంధర్ రెడ్డి, మున్సిఫల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ తో కలిసి భూదేవి శ్రీదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రథం లాగి రథోత్సవాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఇఓ శ్రీనివాస రాజు, మండల కాంగ్రేస్ పార్టీ అధ్యక్షులు మల్లు నర్సింహరెడ్డి, బ్లాక్ కాంగ్రేస్ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి కాంగ్రేస్ నాయకులు గోవింద్ యాదవ్, దర్మాపూర్ నర్సింహారెడ్డి,పోతన్ పల్లి మోహన్ రెడ్డి, అనిల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement