Thursday, December 5, 2024

TS : సైబ‌ర్ పోలీసుల‌కు ష‌ర్మిల ఫిర్యాదు… వారిపై చ‌ర్య‌లు తీసుకోండి…

సోష‌ల్ మీడియాలో త‌న‌ను కించ‌ప‌రిచేలా పోస్టులు పెడుతున్న వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని షర్మిల సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. తనను మానసికంగా వేధిస్తున్నారంటూ.. వైఎస్ షర్మిల ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.

- Advertisement -

నటి శ్రీరెడ్డి , వర్ర రవీందర్ రెడ్డి తో పాటు మరికొంతమంది ఉన్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. మొత్తం 8 మందిపై షర్మిల సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తూ.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆమె పిర్యాదుపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు స్పందించారు. ఆ 8 మందిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కాగా సోషల్ మీడియాను కేంద్రంగా చేసుకొని.. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. తనను మానసికంగా వేధిస్తున్నారంటూ.. వైఎస్ షర్మిల ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement