Friday, May 3, 2024

TS: బాధితులందరికీ పరిహారం చెల్లిస్తాం… ఎమ్మెల్యే శ్రీహరి

మక్తల్, ఫిబ్రవరి25(ప్రభన్యూస్): భీమా ప్రాజెక్టులో అంతర్భాగమైన సంగం బండ రిజర్వాయర్ లెఫ్ట్ లో లెవెల్ కెనాల్ పనులు త్వరలోనే ప్రారంభిస్తామని సి డబ్ల్యూ సి ప్రత్యేక ఆహ్వానితులు చల్లా వంశీచందర్ రెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. సంగంబండ రిజర్వాయర్ వద్ద లెఫ్ట్ లో లెవెల్ కెనాల్ కోసం తొలగించవలసిన బండను పరిశీలించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేవలం 12 కోట్ల రూపాయలు చెల్లించలేని కారణంగా గత 18 ఏళ్లుగా కెనాల్ పనులు పూర్తి కాలేదని అన్నారు. సంగంబండ లెఫ్ట్ లో లెవెల్ కెనాల్ బండ తొలగించడం వల్ల మక్తల్ మాగనూరు మండలాలలోని 9 గ్రామాలలో 20వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తక్షణమే ముఖ్యమంత్రి నీటిపారుదల శాఖ మంత్రితో చర్చించి 12 కోట్ల రూపాయల మంజూరు చేయించి క్లియరెన్స్ తీసుకోవడం జరిగిందని త్వరలోనే రైతుల ఖాతాలో డబ్బులు వేయడంతో పాటు బండ తొలగించే కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. అంతేకాకుండా సంగంబండ, నేరడగం, ఉజ్జెల్లి, గార్లపల్లి, భూత్పూర్, అనుగొండ, అంకెన్ పల్లి, దాదనపల్లి ముంపు గ్రామాల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement