Thursday, September 21, 2023

TS: కామారెడ్డిలో చిరుత కలకలం..

తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లాలో చిరుత కలకలం చోటుచేసుకుంది. జిల్లాలోని మాచారెడ్డి మండలం అక్కాపూర్‌ శివారులోని పొలం వద్ద లేగ దూడను చిరుత పులి ఎత్తుకెళ్లింది. పంట పొలాల్లో చిరుత పాదముద్రలను గుర్తించిన స్థానికులు పోలీసులు, అటవీ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన అటవీ సిబ్బంది, చిరుత అడుగులను నిర్ధారించారు. ఈసందర్భంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా వెళ్లొద్దని, జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement