Saturday, April 27, 2024

అర్దరాత్రి లాఠీగ్యాంగ్ హల్ చల్

తెలంగాణ లాక్ డౌన్ కఠినంగా అమవతున్న వేళ.. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్దరాత్రి లాఠీగ్యాంగ్ హల్ చల్ చేస్తోంది. ఎవరైనా బయటికి వస్తే దాడికి పాల్పడుతున్నారు. అర్దరాత్రి బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షహీన్ నగర్ రోడ్లపై ఒక్కో బైక్ పై ఇద్దరు హల్ చల్ చేస్తున్నారు. కొందరు బైకులపై తిరుగుతూ లాఠీలు చేత బట్టుకొని కనిపించిన వారిని చితక చితకబాదుతున్నారు. లాఠీగ్యాంగ్ ఆగడాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. దీంతో కాలనీవాసులు బాలాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొదట పోలీసులుగా భావించిన స్థానికులు..నాలుగైదు బైక్ లపై లాఠీలు పట్టుకొని పోలీస్ డ్రెస్ లేకుండా సంచరించడంతో అనుమానం కలిగింది. అనంతరం సీసీ కెమెరా దృశ్యాలు పరిశీలించి రాచకొండ సీపీ దృష్టికి తీసుకువెళ్లారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement