Sunday, April 28, 2024

బంగార్రాజు లో గ్యాంగ్ లీడర్ హీరోయిన్ ?

అక్కినేని నాగార్జున కెరీర్ లో సూపర్ డూపర్ హిట్ అయిన సినిమా సోగ్గాడే చిన్ని నాయన. ఈ సినిమా కు సీక్వెల్ గా బంగార్రాజు సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. గత ఏడాది ఈ సినిమా పట్టాలెక్కాల్సి ఉండగా వీలు కాలేదు.కానీ జూలై నుంచి ఈ సినిమాను ప్రారంభించబోతున్నారట. ఈ చిత్రంలో రమ్యకృష్ణ కూడా నటించబోతున్నారు. అంతేకాకుండా ఈ సినిమాని స్వయంగా అక్కినేని నాగార్జున నిర్మిస్తున్నారు.

కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అక్కినేని నాగ చైతన్య కూడా ఓ ప్రధాన పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో చైతు సరసన తమిళ బ్యూటీ ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తోందట. అందుకు సంబంధించి అధికారిక ప్రకటన త్వరలోనే రివీల్ చేయబోతున్నారట.

Advertisement

తాజా వార్తలు

Advertisement