Friday, May 3, 2024

Wyra: ఎండుతున్న పంటలకు సాగర్ నీరివ్వాలి … బొంతు రాంబాబు

వైరా, అక్టోబర్ 30 (ప్రభ న్యూస్): వైరా రిజర్వాయర్ ను సాగర్ జలాలతో నింపి ఎండుతున్న పంటలను కాపాడాలని సీపీఎం రైతు సంఘం జిల్లా కార్యదర్శి రైతులతో కలిసి రిజర్వాయర్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. వైరా ఆయకట్టు పరిధిలోని 20వేల ఎకరాల్లో ఎండుతున్న పంటలను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఆయకట్టు పరిధిలో వరి పంట పొట్ట దశలో ఉందని, మిర్చి, పత్తి పంటలకు నీటి ఎద్దడి ఏర్పడిందని, వైరా రిజర్వాయర్ నీటిమట్టం 12 అడుగులకు తగ్గిందని, రిజర్వాయర్ ను సాగర్ జలాలతో నింపి ఎండుతున్న పంటలను తక్షణమే కాపాడాలని ఆయన కోరారు.

సాగునీటికే కాకుండా బోడేపూడి సృజల స్రవంతి ద్వారా మిషన్ భగీరథ ద్వారా వైరా, కోణిజర్ల, తల్లాడ, మధిర మండలాలకు త్రాగునీరు సరఫరా అవుతుందని, తక్షణమే ప్రభుత్వం స్పందించి సాగు, త్రాగునీటికి ఇబ్బంది లేకుండా సాగర్ జలాలతో రిజర్వాయర్ ను నింపి చర్యలు తీసుకోవాలని కోరారు. రైతులు, రైతు సంఘం నాయకులు, నాలుగు మండలాల ప్రజలు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement