Sunday, May 5, 2024

Jobs : విజయవాడ సివిల్ సప్లైస్ లో అకౌంటెంట్ ఖాళీలు

ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలోని ఏపీ స్టేట్‌ సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌… ఒప్పంద/ అవుట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించింది. అకౌంటెంట్ గ్రేడ్‌-3: 08 పోస్టులు, చార్టర్డ్ అకౌంటెంట్: 01 పోస్టు, డేటా ఎంట్రీ ఆపరేటర్: 04 పోస్టులు, చార్టర్డ్ అకౌంటెంట్: 01 పోస్టు,మొత్తం ఖాళీలు: 13 పోస్టులు ఖాళీ ఉన్నాయి.

పోస్టును అనుసరించి డిగ్రీ, సీఏ, ఎంబీఏ, ఎంకాం ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. వయోపరిమితి35 ఏళ్లు మించకూడదు. ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను జిల్లా పౌర సరఫరాల మేనేజర్ కార్యాలయం, ఏపీ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్, గవర్నర్‌పేట్‌, విజయవాడ చిరునామాకు న‌వంబ‌ర్ 10వ తేదీలోపు పంపాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement